Heart attack: గుండె స‌మ‌స్య‌లున్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తోన్న ఆసుప‌త్రి... ఎక్క‌డో తెలుసా?

Published : Jul 04, 2025, 12:30 PM ISTUpdated : Jul 04, 2025, 08:07 PM IST

ప్ర‌స్తుతం మారిన జీవ‌న విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేయించుకోవాలంటే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సిందే. అలాంటి వారి కోసం ఉచితంగా వైద్యం అందిస్తోంది ఓ ఆసుప‌త్రి. 

PREV
15
హసన్ జిల్లాలో గుండెపోటుతో మరణాల కలకలం

కర్నాటకలోని హసన్ జిల్లాలో కేవలం 40 రోజుల్లో 22 మంది గుండెపోటుతో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలపై సీఎం ఉత్తర్వులతో ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది. అయితే గుండెపోటుతో మరణాలపై కొందరు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం వల్ల అని అనుమానిస్తున్నారు. ఈ వాదనను కేంద్రం ఖండించింది. అయినా, హసన్ ప్రజల్లో భయం ఇంకా తగ్గలేదు.

25
బాధితులకు ఉచిత వైద్యం అందిస్తున్న శ్రీ మధుసూదన్ సాయి ఆస్పత్రి

ఈ సంక్షోభ సమయంలో, హసన్ జిల్లా ప్రజలకు శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ భరోసానిస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలోని ముద్దెనహళ్లి వద్ద 360 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నడుపుతోంది. గత నాలుగేళ్లుగా ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

35
గుండె వైద్యంలో ప్రత్యేక నిపుణుల సేవలు

ఇక్కడ కార్డియక్ (గుండె) విభాగానికి సంబంధించి దేశీయ, అంతర్జాతీయ నిపుణులచే సేవలు అందిస్తున్నారు. ఇక్క‌డ అత్యాధునిక పరికరాలతో, ప్రపంచస్థాయి వైద్యం అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. హసన్ జిల్లాలో గుండె సంబంధిత కేసులు తలెత్తిన నేపథ్యంలో అక్కడ బాధితులకు కూడా పూర్తిగా ఉచితంగా వైద్యం అందించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

45
దేశవ్యాప్తంగా 34 వేల మందికి ఉచిత శస్త్రచికిత్సలు

ఈ ఆస్పత్రిని గ్లోబల్ హ్యూమానిటేరియన్, ఆధ్యాత్మిక నాయకుడు శ్రీ మధుసూదన్ సాయి ఆధ్వర్యంలో నడుపుతున్నారు. ఆయన ప్రారంభించిన శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ (Sri Madhusudan Sai Global Humanitarian Mission) ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 37,000 పైగా చిన్నారులకు ఉచితంగా హృదయ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇది దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన సేవలుగా గుర్తింపు పొందింది.  

55
అపాయింట్మెంట్, ఆస్పత్రి వివరాలు

వైద్యం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్

08156 275811 (ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4:00 వరకు) సంప్ర‌దించండి. పూర్తి వివ‌రాల కోసం ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. ఆస్పత్రి చిరునామా. శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ముద్దెనహళ్లి, సత్యసాయి గ్రామం, చిక్కబళ్లాపూర్ జిల్లా, కర్నాటక.

Read more Photos on
click me!

Recommended Stories