Pakistan: పాక్ నాయకుడి నోరు మూయించిన ఈజిప్ట్ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే

Published : Jun 05, 2025, 12:09 PM IST

పహల్గాం దాడిని భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్నారనే బిలావల్ భుట్టో వ్యాఖ్యలను ఈజిప్ట్ జర్నలిస్ట్ ఖండించారు. 

PREV
15
ఆరోపణలు ఖండిస్తూ

'భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి పహల్గాం దాడిని అస్త్రంగా వాడుతున్నారు' అని పాకిస్తాన్ పిపిపి నాయకుడు బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు గట్టి అవమానం ఎదురైంది. ఆయన ఈ ఆరోపణ చేసినందుకు ప్రతిగా, పాత్రికేయుల సమావేశంలో ఉన్న ఈజిప్ట్ జర్నలిస్ట్ అహ్మద్ ఫాతి, కల్నల్ సోఫియా ఖురేషి పేరును ప్రస్తావించి తిప్పికొట్టారు.

25
నోరు మూసుకున్న భుట్టో

'పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చిన ఆ మహిళా సైనిక అధికారి (కల్నల్ సోఫియా ఖురేషి) ఎవరు?' అని ప్రశ్నించారు. దాంతో భుట్టో నోరుమూసుకున్నారు. భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించారని భుట్టో చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ పడింది. 

35
ఆపరేషన్ సిందూర్

భారతదేశంలోని పర్యాటక ప్రదేశం పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేపేరిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది.

45
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు

ఈ విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాకు అందించారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఇద్దరూ మహిళలు. సింధూర్ ఆపరేషన్ గురించి ఎంతో స్పష్టంగా, వివరంగా ప్రపంచానికి వీరిద్దరూ చెప్పారు.

55
ప్రశంసలు

అంతర్జాతీయ మీడియా ముందు ఆచితూచి, అవసరమైనప్పుడు మాత్రమే ప్రతి పదాన్ని ఉపయోగించినందుకు, మొత్తం పాత్రికేయుల సమావేశం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories