Dussehra Holidays Trip : దసరా వేళ ఫ్యామిలీతో వెళ్లాల్సిన బెస్ట్ ప్లేసెస్.. సెలవుల్లో మీరూ ప్లాన్ చేసుకొండి

Published : Sep 19, 2025, 07:14 PM IST

Dussehra Holidays Trip : దసరా పండగ సమయంలో కొన్ని నగరాలు, ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. కుదిరితే ఈసారి సెలవుల్లో ఈ ప్రాంతాలను చుట్టిరండి… ప్రత్యేక అనుభూతిని పొందండి. 

PREV
16
ఈ దసరాకు పిల్లలతో మంచి ట్రిప్ ప్లాన్ చేయండి

Dussehra Holidays Trip : తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది. కానీ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు రేపటినుండే (సెప్టెంబర్ 20) విద్యార్థులకు సెలవులు ఇస్తున్నాయి... దసరా తర్వాత కూడా మరో రెండ్రోజులు వీకెండ్ హాలిడేస్ కలిసివస్తున్నాయి. ఇలా కొందరికి 16 రోజులు సెలవులు వస్తుండగా మిగతావారికి 13 రోజులు వస్తున్నాయి. ఇలా వరుస సెలవుల నేపథ్యలో పిల్లలతో పేరెంట్స్ మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

26
దసరా వేళ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే

ఈ దసరా పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు... కానీ కొన్నిచోట్లు వేడుకలు చాలా ప్రత్యేకం. ఇలా ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం ఈ సమయంలోనే ఇక్కడి ఆద్యాత్మికను, అట్టహాసంగా జరిగే ఉత్సవాలను చూసేందుకు వీలుంటుంది. ఇలా దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం... అక్కడికి కుటుంబంతో కలిసివెళ్ళి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడమే కాదు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.

36
1. మైసూర్

దసరా ఉత్సవాలు అనగామే ముందుగా గుర్తుకువచ్చేది మైసూర్. కర్ణాటకలోని ఈ ప్రాచీన నగరంలో జరిగే దసరా ఉత్సవాలకు 400 సంవత్సరాకు పైగా చరిత్ర ఉంది. ఇప్పటికీ ఈ నగరం దసరా వచ్చిందంటే చాలు రాజుల కాలం మాదిరిగా ముస్తాబవుతుంది... రాచకుటుంబం వడయార్ వంశానికి చెందినవారు ఈ వేడుకలను నిర్వహిస్తారు. మైసూర్ ప్యాలెస్ ను అందంగా ముస్తాబు చేస్తారు... అమ్మవార్ల ఊరిగింపు, ఏనుగు అంబారీల ఊరేగింపు, టార్చ్ లైట్ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా పదిరోజుల పాటు మైసూరులో అంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయి. కాబట్టి దసరా సెలవుల్లో ఈ నగరాన్ని చుట్టిరావడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

46
2. కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దసరా పండగ సమయంలో దుర్గా పూజ అట్టహాసంగా నిర్వహిస్తారు. నగరమంతా దుర్గామాత విగ్రహాలతో కూడిన మండపాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజలు అందంగా డెకరేట్ చేసిన మండపాల్లో దుర్గామాతను ప్రతిష్టిస్తారు... రంగురంగుల విద్యుత్ దీపాలు, ఇతర అలంకరణలు చేస్తారు. దసరా పండగరోజున దుర్గామాత విగ్రహాలను భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఇలా దసర సెలవుల్లో కోల్ కతాను సందర్శించవచ్చు.

56
3. వారణాసి

ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో కూడా దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ పురాతన పట్టణంలోని రామ్ నగర్ కోట వద్ద శ్రీరాముడి జీవితంలోని ఘట్టాలతో 'గ్రాండ్ రామ్ లీల' ప్రదర్శిస్తారు. అలాగే గంగానది తీరంలో వేలాదిమంది తరలివచ్చి మట్టి దీపాలను వెలిగిస్తుంటారు. అలాగే దసరా రోజు నదిలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం ఉంటుంది. ఇలా దసరా నవరాత్రుల్లో వారణాసి ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది.... కాబట్టి ఈ సమయం ఈ ఆద్యాత్మిక నగరాన్ని సందర్శించేందుకు సరైనది.

66
4. రాజస్థాన్

రాజస్థాన్ అంటేనే ప్రాచీన రాచరిక వైభవానికి ప్రతీక. ఇక్కడ అందమైన కోటలను దసరా వేడుకల కోసం ముస్తాబు చేస్తారు... పర్యాటకులను ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడతారు. జైపూర్ వంటి నగరాల్లో నవరాత్రుల సమయంలో రామ్ లీలా ప్రదర్శనలు జరుగుతాయి. అమ్మవారి విగ్రహాలను ఘనంగా ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. కాబట్టి రాజస్థాన్ దసరా వేడుకలకు ప్రత్యేకంగా ముస్తాబవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories