మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రతిపక్షాలు, జాతీయ నాయకులు, మీడియా వర్గాలు దీదీ అనే ముద్దు పేరుతో పిలుస్తారు.
మాయావతి
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, దళిత నాయకురాలు మాయావతిని రాజకీయ రంగంలో బువా అనే ముద్దు పేరుతో గుర్తిస్తారు. దీని అర్థం తండ్రి సోదరి (అత్త).
అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను ప్రత్యర్థులు భతీజా అనే ముద్దు పేరుతో పిలుస్తారు. దీని అర్థం సోదరుడి కుమారుడని.
శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రముఖంగా మామాజీ లేదా మామా అనే ముద్దు పేర్లతో పిలుస్తారు.
జవహర్‌లాల్ నెహ్రూ
దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను పండిట్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. చాచా అనేది ఆయనకు ఉన్న మరో ముద్దు పేరు.
మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యర్థులు, మీడియా వర్గాలు 'సైలెంట్ పీఎం' అనే ముద్దు పేరుతో పిలిచేవారు.
నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీని నమో అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. నరేంద్ర లో 'న' మోడీలోని 'మో' తీసుకునే నమోగా పిలుస్తారు. చాయ్‌వాలా, విశ్వగురు అనేవి ఆయనకు ఉన్న మరికొన్ని ముద్దు పేరు.
సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
యోగి ఆదిత్యనాథ్
ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను యోగి, బుల్డోజర్ బాబా అనే ముద్దు పేర్లతో పిలుస్తారు. ఆయన ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి ఇళ్లపై బుల్డోజర్లను ఉపయోగిస్తుంది. అందువల్లే ఆయనను బుల్డోజర్ బాబా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక నిత్యం కాషాయధారిగా కనిపించే ఆయనను ముందునుండి యోగి అంటుంటారు.
రాహుల్ గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రత్యర్థి పార్టీలు 'పప్పు' అంటు సంభోదిస్తాయి. ఇక కాంగ్రెస్ శ్రేణులు, మీడియా వర్గాలు యువరాజుగా అభివర్ణిస్తారు.