టికెట్‌ బుక్ చేసుకునే ముందు ఓసారి ఆలోచించండి.. ఇండియాలోనే డర్టీయెస్ట్ ట్రైన్స్ ఇవే!

First Published | Aug 24, 2024, 2:58 PM IST

భారతీయ రైల్వేలో అత్యంత మురికి రైళ్లు ఇవి. ఒక్కసారి ప్రయాణిస్తే మళ్లీ ఎప్పటికీ ప్రయాణించాలని మీరు కోరుకోరు. ఇండియాలో నడిచే ఆ రైళ్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

ఇండియన్ రైల్వేస్

ఇండియన్ రైల్వేస్ శుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్‌లను క్లీన్‌గా ఉంచడానికి ప్రాధాన్యమిస్తుంది. అయితే, ప్రయాణికుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొన్నిసార్లు ఇది సాధ్యం కాదు. ఇటీవల కాలంలో రైళ్లు, రైల్వే స్టేషన్లలో శుభ్రత గురించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Dirtiest Trains in India

రైళ్లలో శుభ్రత, ఇతర అంశాలపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మురికి, దుర్వాసనతో ప్రయాణికులు తరచూ విసిగిపోతుంటారు. ఈ విషయంలో పదేపదే ఫిర్యాదు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.

Latest Videos


రైళ్ల జాబితా

దేశవ్యాప్తంగా నిత్యం రాకపోకలు సాగించే అనేక రైళ్లలో శుభ్రతను మెయింటెయిన్ చేయడం సాధారణ విషయం కాదు. దీంతో మురికిగా ఉన్న రైళ్లలోనే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరాల్సి వస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో తిరిగే రైళ్ల జాబితా ఉంది. ప్రయాణికుల అనుభవం ఆధారంగా దీనిని రూపొందించారు. అవేంటంటే..?

సహర్సా-అమృత్‌సర్ గరీబ్ రథ్

సహర్సా- అమృత్‌సర్ గరీబ్ రథ్ రైలు.. బీహార్, పంజాబ్ మధ్య కనెక్టివిటీని అందించే ముఖ్యమైన రైలు. దీని శుభ్రత గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ రైలును దేశంలోని అత్యంత మురికి రైళ్లలో ఒకటిగా పరిగణిస్తారు.

సీమాంచల్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి జోగబానికి నడుస్తుంది. ఈ రైలులో శుభ్రతకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రైల్వేకి వస్తున్నాయి. అయితే, రైల్వే శాఖ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వైష్ణోదేవి - బాంద్రా.. స్వరాజ్ ఎక్స్‌‌ప్రెస్

స్వరాజ్ ఎక్స్‌‌ప్రెస్.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా టెర్మినస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య నడుస్తుంది. ఈ రైలు వారానికి నాలుగు రోజులు అంటే సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం నడిచే ఈ రైలు కూడా మురికి రైళ్ల జాబితాలో ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ రైలులో శుభ్రత గురించి అనేక ఫిర్యాదులు చేశారు. 2023లో, రైల్వే ఈ రైలు గురించి 61 ఫిర్యాదులు అందాయి.

త్రిపుర సుందరి ఎక్స్ ప్రెస్

పంజాబ్‌లోన ఫిరోజ్ పూర్ - త్రిపుర రాజధాని అగర్తలా మధ్య నడిచే త్రిపుర సుందరి ఎక్స్ ప్రెస్ కూడా మురికి రైళ్లలో ఒకటి. దీని సేవలకు సంబంధించి ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. పేరుకు మాత్రమే ఇది సుందరి ఎక్స్‌ప్రెస్.

అజ్మీర్-జమ్మూ తావి పూజ ఎక్స్ ప్రెస్

రాజస్థాన్‌లోని అజ్మీర్ జంక్షన్ నుంచి జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ తావికి ప్రయాణించే పూజా ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఒక మురికి రైలు. ప్రయాణికులకు వేరే మార్గం లేక ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. టాయిలెట్ల దుర్వాసన అంతా కోచ్‌లోకి వ్యాపిస్తుంటుందని తరచూ దీనిపై ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు.

click me!