Delhi Earthquake : ఇవాళ తెల్లవారుజామున దేశ రాజధాని డిల్లీ వణికిపోయింది. డిల్లీ భూకంపం షాక్ నుండి తేరుకోకముందే బిహార్ లో భూమి కంపించింది. ఇలా కేవలం గంట వ్యవధిలోనే రెండుచోట్ల భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత తక్కువగా వుండటంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏమీ జరగలేదు.
సోమవారం తెల్లవారుజామున డిల్లీ ప్రజలు నిద్రలో ఉండగానే భూమి కంపించింది. తెల్లవారుజామున 5.35 గంటలకు డిల్లీ శివారులోని నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. దీంతో నిద్రలేస్తూనే ఇళ్లలోంచి బయటకు పరుగు తీసారు.
ఇలా డిల్లీ ప్రజలు ఇంకా షాక్ లో వుండగానే బిహార్ భూకంపం సంభవించింది. ఉదయం 8 గంటలకు బిహార్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా కాళ్లకింది భూమి కదలడంతో ఆందోళనకు గురయ్యారు... ఎక్కడ ఇండ్లు కూలిపోతాయోనని ప్రజలు బయటకు పరుగుతీసారు. ఇక ఉదయమే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనులపై వాహనాలపై వెళుతున్నవారు భూప్రకంపనలతో భయాందోళనకు గురయి రోడ్డుపక్కకు పరుగుతీసారు.
బిహార్ లోని సివాన్ జిల్లాలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పది కిలోమీటర్ల లోతులోని భూమి పొరల్లో సర్దుబాట్ల కారణంగా భూమి కంపించినట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0 గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
గుర్తించారు.
డిల్లీలో మళ్లీ భూకంపం వస్తుందా? ప్రధాని మోదీ కీలక ప్రకటన
దేశ రాజధాని న్యూడిల్లీ ప్రజలు ఇప్పటికే భూకంప భయంతో వణికిపోతున్నారు.ఈ సమయంలో మరోసారి భూమి కంపించే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీంతో డిల్లీ ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ డిల్లీ భూకంపంపై స్పందించారు. డిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురికావద్దని... ప్రశాంతంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరోసారి భూకంపం సంభవించే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు కూడా పరిస్థితిని గమనిస్తున్నారని...అత్యవసర సమయాల్లో సహాయం చేయడానికి రెడీగా ఉన్నారని ప్రధాని తెలిపారు.
డిల్లీకి భూకంప ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎలాంటి సాయం కావాలన్నా అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ 112 కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు భయపడకుండా దైర్యంగా వుండాలని... ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిల్లీ అధికారలు తెలిపారు.
భూకంపం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇప్పటికే దేశ రాజధాని భూకంపంతో వణికిపోయింది... మళ్లీ భూమి కంపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. భూమి కంపించగానే ఎక్కడ ఇళ్లు కూలిపోతుందోనని చాలామంది బయటకు పరుగు తీస్తారు. కానీ భూకంప సమయంలో ఇంట్లో ఉండటమే సేఫ్... భయటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ స్తంభాలు కూలడం,విద్యుత్ తీగలు తెగిపడటం, వాహనాలు అదుపుతప్పడం, హోర్డింగ్ లు వంటివి కుప్పకూలి ప్రమాదం జరగవచ్చు... కాబట్టి ఇంట్లోనే ఉండి బలమైన బల్లకిందో, మంచంకింద దూరడమో చేయాలి.
2. ఇక భయట ఉన్నపుడే భూకంపం సంభవిస్తే వెంటనే దగ్గరున్న సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్, పెద్ద భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలి. ఖాళీగా ఉండే ప్రాంతాల్లోనే వేచివుండాలి.
3. డ్రైవింగ్ లో ఉంటే వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాలి. చెట్లు, స్తంభాలు లేనిప్రాంతంలో వాహనాన్ని నిలపాలి.
4.అపార్ట్ మెంట్స్, పెద్దపెద్ద భవంతుల్లో నివాసం ఉండేవారు భూకంప సమయంలో కంగారుపడి బయటకు పరుగు తీయవద్దు... ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లిప్ట్ ఎక్కడం అస్సలు చేయకూడదు.
5. భూకంపాల సమయంలో పొలాల వద్ద వుండే రైతులు చెట్లకు దూరంగా వుండాలి. మైదాన ప్రాంతంలో వుండటమే సురక్షితం... భూప్రకంపనల కారణంగా చెట్లు బలహీనపడి కూలిపోయే అవకాశం వుంటుంది. కాబట్టి భూకంప సమయంలో చెట్లకింద ఉండటం అంత సేఫ్ కాదు.
ఇవి కూడా చదవండి