Pension Hike NPS కు బదులు UPS.. ఉద్యోగులకు భారీ లబ్ది?

Published : Feb 17, 2025, 08:59 AM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిఏ పెంపునకు ముందే పెన్షన్ ఏకంగా 50 శాతం పెరగనుంది! ఏప్రిల్‌లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అమల్లోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

PREV
17
Pension Hike  NPS కు బదులు UPS.. ఉద్యోగులకు భారీ లబ్ది?
50% పెరుగుదల

డీఏ  పెంపునకు ముందే ఈ డబ్బు ఏకంగా 50 శాతం పెరగనుంది! ఏప్రిల్‌లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెరిగిన మొత్తం కలిసి రానుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

27
NPS కు ప్రత్యామ్నాయంగా UPS

ప్రభుత్వం  నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి ప్రత్యామ్నాయంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభించింది. దీన్ని మరో రెండు నెలల్లో అమలు చేయనున్నారు.

37
ఏప్రిల్ నుంచి UPS అమలు

ఈ ఏడాది జనవరి 24న అధికారికంగా ఈ పథకం ప్రకటించారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు కానుంది. దీంతో అధిక ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే NPSలో నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే UPS వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు NPS లేదా UPSలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

47
UPS కు మారే అవకాశం

NPS పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మునుపటి పెన్షన్ పథకంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు.

57
UPS కింద నిర్దిష్ఠ పెన్షన్

UPS కింద, కేంద్ర ఉద్యోగులకు ఇప్పుడు ఒక నిర్దిష్ఠ మొత్తం పెన్షన్ ఇస్తారు. ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక జీతంలో సగం ఉంటుంది. ఈ పెన్షన్ పొందడానికి ఏదైనా ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలు పనిచేయాలి.

67
కుటుంబానికి పెన్షన్

ఏదైనా కారణం చేత ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగి కుటుంబానికి ఒక నిర్దిష్ఠ మొత్తంలో పెన్షన్ కూడా ఇస్తారు. ఇది ఉద్యోగికి లభించే పెన్షన్‌లో 60 శాతం ఉండవచ్చు.

77
కనీస హామీ పెన్షన్

అలాగే కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, ఎవరైనా 10 సంవత్సరాలు పనిచేస్తే, వారు కనీసం 10 వేల రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హులు.

click me!

Recommended Stories