ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి
దేశ రాజధాని డిల్లీకి అన్నిరాష్ట్రాల నుండి విమాన సర్వీసులు నడుస్తాయి. ఇక్కడి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) భారతదేశంలోనే అతి పెద్ద విమానాశ్రయమే కాదు బిజీగా ఉండేది కూడా. ఈ ఎయిర్ పోర్ట్ లో మొత్తం మూడు టెర్మినల్స్ (T1, T2, T3), నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతం T1, T2లను దేశీయ విమానాల కోసం మాత్రమే వాడుతున్నారు. T3ని విదేశాలకు వెళ్లే లేదా వేరే దేశం నుంచి వచ్చే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు. ఏప్రిల్ 15 నుంచి T-2 బంద్ అయింది. ఇప్పుడు అన్ని దేశీయ విమానాల రాకపోకలు ఇక T-1కి మార్చారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1లో జరిగిన మార్పులు ఏంటి?
టెర్మినల్ 1ని పెద్దది చేశారు. ఇప్పుడు ఇది ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.
T-1లో 100 చెక్-ఇన్ కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ 36 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ (ఎస్‌బీడీ) కియోస్క్‌లు, చెక్-ఇన్ ఇంకా సెల్ఫ్-సర్వీస్ కోసం 108 కామన్ యూసేజ్ సెల్ఫ్-సర్వీస్ (సీయూఎస్ఎస్) కియోస్క్‌లు ఉన్నాయి. దీనితో పాటు సెక్యూరిటీ చెకింగ్ కోసం 20 ఆటోమేటెడ్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ఏటీఆర్ఎస్)లు పెట్టారు.
టెర్మినల్ సైజును 55,740 చదరపు మీటర్ల నుంచి 2,06,950 చదరపు మీటర్లకు పెంచారు.
టెర్మినల్ 1కి దానికంటూ ఒక మెట్రో స్టేషన్ ఉంది. మెజెంటా లైన్ ఢిల్లీ మెట్రో స్టేషన్ జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్‌కు కలుపుతుంది. అలాగే, టెర్మినల్ 1-ఐజీఐ ఎయిర్‌పోర్ట్ స్టేషన్ నుంచి కలుస్తుంది.