Prices Hike : వామ్మో... ఆ నగరంలో బతకగలమా? ధరల మోత... ప్రజల వెత!

Published : Apr 15, 2025, 01:17 PM IST

Prices Hike: సిలికాన్‌ వ్యాలీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు అభివృద్దిపథంలో దూసుకెళ్తోంది. అయితే.. మరోవైపు నగరంలోని ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కాలంలో నంది పాల నుంచి మెట్రో రైల్‌ ఛార్జీల వరకు అన్ని రేట్లు భారీగా పెరిగాయి. దీంతో ఇక సామాన్యులు, ఓ స్థాయి ఉద్యోగాలు చేసుకునేవారు కూడా అక్కడ బతకడం రానురాను కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు వల్లే కర్నాటక ప్రభుత్వం ఇలా ధరలు పెంచుతుందా లేదా మరేమైన కారణాలు ఉన్నాయా.. అసలు ధరలు ఏ మేర పెంచారు అన్న విషయం ఇప్పుడు చూద్దాం. 

PREV
18
Prices Hike : వామ్మో... ఆ నగరంలో బతకగలమా? ధరల మోత... ప్రజల వెత!
banglore garuda ksrtc

బెంగళూరులో నగరంలో గడిచిన ఏడాది కాలంలోనే అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే ఉద్యోగులు కూడా ఈ ధరలు హడలెత్తిపోతున్నారు. వచ్చిన జీతంలో సగానికి పైగా ఖర్చులకే వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నగరంలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రభుత్వం పెంచుతున్న ధరల వల్ల గృహ బడ్జెట్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రవాణా, ఇంధనం నుంచి పాలు మరియు టోల్ ఛార్జీల పెంపు ఇలా అనేక సేవల ధరలను పెంచిసింది అక్కడి కాంగ్రెస్‌ సర్కార్‌. 

28
banglore metro prices hike

మెట్రలో ఛార్జీలో మోత..

ఇటీవల కాలంలో బెంగళూరులో సేవలు అందిస్తున్న నమ్మ మెట్రో ఛార్జీలను పెంచారు. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ఆ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న గరిష్ట ఛార్జీని రూ.60 నుంచి రూ.90కి పెంచింది. అదనంగా, స్మార్ట్ కార్డులలో అవసరమైన మినమం బ్యాలెన్స్‌ను రూ.50 నుంచి రూ.90కి వరకు పెంచి దాదాపు రెట్టింపు చేసింది. వేలాది మంది రోజువారీ ప్రయాణికులు ఇప్పటకే మెట్రోపై ఆధారపడుతుండటంతో 50 నుంచి 90% ఛార్జీల పెంచడం వల్ల బెంగళూరు నివాసితులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోంది. 

38
banglore Karnataka

బిఎమ్‌టిసి బస్సు ఛార్జీల పెరుగుదల...

కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రవాణా సంస్థల్లో ఛార్జీలను 15% వరకు పెంచాలని జనవరిలో నిర్ణయం తీసుకంది. దీని ఫలితంగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల టికెట్ ధరలు పెరిగాయి. దీంతో రోజువారీ లక్షలాది మంది ప్రయాణించే వారిపై రవాణా భారం పడింది. ప్రభుత్వం పెంచిన ధరలతో సాధారణ రోజువారీ పాస్ ధర రూ.70 నుంచి రూ. 80 వరకు పెంచేసింది. ఇక వారాంతపు పాస్ ధర రూ.300 నుంచి రూ.350కి పెంచేసింది. సాధారణ నెలవారీ పాస్ ధర ఇప్పుడు రూ.1,200 వరకు చేరింది. గతంలో ఇది రూ.1,050 ఉండేది. పెంచిన ధరలతో విద్యార్థులు, సాధారణ ప్రయాణీకులను మరింత ప్రభావితం చేస్తోంది. 

48
banglore

పాల ధరలు పైపైకి.. 

ఇక పాల ధరలను రెండు మూడు నెలలకు ఒకసారి పెంచేస్తున్నారు. ఏడాది కాలంలో అనేకసార్లు ధరలను పెంచేశారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంల ఉన్న నంది పాల ధరలను రీసెంట్‌గా మరోసారి పెంచారు. ఏప్రిల్ నుంచి వీటిని అమలులోకి తీసుకొచ్చారు. అయితే.. ఈ దఫా ఏకంగా లీటరుకు రూ.4 లను పెంచారు. ఇది జులై 2023లో లీటరుకు రూ.3 ఆ తర్వాత జూన్ 2024లో లీటరుకు రూ.2 వరకు పాల ధరలు పెంచారు. దీంతో గత ఏడాది అరలీటర్‌ రూ.40 ఉండగ.. ఇప్పుడు రూ.46కు చేరింది. దీంతో మిగిలిన అమూల్, హెరిటేజ్ సంస్తలు కూడా ధరలను పెంచేశాయి. 

58
banglore Karnataka price hike

కీలక మార్గాల్లో టోల్ ఫీజుల పెంపు...

ఏప్రిల్ 1 నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఛార్జీలను పెంచడంతో బెంగళూరులోని ప్రధాన రహదారుల నుంచే ప్రయాణికులకు భారంగా మారింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారు, శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ ఉపయోగించే ప్రయాణికులు ఇప్పుడు ఎక్కువ టోల్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. సదహళ్లి మరియు హులికుంటె మరియు నల్లూరు దేవనహళ్లి వంటి ముఖ్యమైన టోల్ ప్లాజాల వద్ద రేట్లు అయిదు శాతం వరకు పెరిగాయి. 119 కి.మీ. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో కూడా టోల్ రేట్లు పెంచారు. దీంతో బెంగళూరుకి రావాలన్నా.. అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాలన్నా... ప్రయాణికుల తడిసిమోపెడవుతోంది. 

68
banglore Karnataka price hike

కొత్త వాహనాలు.. ఇంధన ధరల పెంపు.. 

గత సంవత్సరం ఇంధన ధరలు కూడా పెరిగాయి. జూన్ 2024 నుంచి పెట్రోల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడంతో బెంగళూరులో లీటరుకు రూ.102.84 వసూలు చేస్తున్నారు. డీజిల్ ధర కూడా ఇదే విధంగా రూ.3.02 పెంచగా.. లీటరుకు ₹ 88.95 కి చేరుకుంది. పెట్రోల్ డీజిల్ పై అమ్మకపు పన్ను రేట్లను సవరించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ధరలు పెరిగాయి. ఇక జనవరిలో ప్రవేశపెట్టిన అదనపు రిజిస్ట్రేషన్ సెస్ కారణంగా కర్ణాటకలో కొత్త వాహనం కొనుగోలు చేయడం ప్రియంగా మారింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులు ఇప్పుడు అదనంగా రూ. 500 చెల్లించాలి, కారు యజమానులు రిజిస్ట్రేషన్ ఫీజులో అదనంగా రూ.1,000 చెల్లించాల్సి వస్తోంది. 

78
banglore Karnataka price hike

విద్యుత్‌, మద్యం కూడా.. 

బెంగళూరులో విద్యుత్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ రాబోయే మూడు సంవత్సరాలకు స్థిర ఛార్జీల పెంపును ఆమోదించింది. దీంతో ధరల పెరుగుదల గృహాలు, వ్యాపార సముదాయాలపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సవరించిన రేట్లు వచ్చే నెల నుంచి అమలులోకి రానున్నాయి. గత రెండేళ్లుగా కర్ణాటకలో మద్యం ధరలు అనేకసార్లు సవరించారు. దీని వలన దక్షిణ భారతదేశంలో మద్యం ధరలు అధికంగా వసూలు చేస్తున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం విధింస్తున్న పన్నులు, సుంకాల వల్ల ధరల పెరుగుతున్నాయని అంటున్నారు. 

88
Karnataka price hike

సంక్షేమ పథకాల అమలు వల్లేనా.. 

ద్రవ్యోల్బణం భారం కారణంగా ఖర్చులను పెంచుతున్నట్లు కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. పన్నుల రూపంలో వస్తున్న డబ్బులను ప్రధాన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయిదు పథకాల అమలుకు నిధుల వాడుతున్నట్లు ప్రభుత్వం అంటోంది. అయితే ధరలను పెంపును ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జెడి(ఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories