Extramarital affair : అర్థరాత్రి కోడలి గదిలో మామ స్నేహితుడు... ఇద్దరి రాసలీలలు చూసి అత్త షాక్..!

Published : Feb 02, 2026, 01:07 PM IST

Extramarital affair : మానవ బంధాలకే మచ్చలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. తండ్రి వయసుండే మామ స్నేహితుడితో ఓ కోడలు వివాహేతర సంబంధం కొనసాగిస్తూ బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. 

PREV
16
మానవ సంబంధాలకే మచ్చ..

Extramarital affair: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. జీవిత భాగస్వామి, పిల్లలతో హాయిగా జీవితం సాగుతున్న సమయంలోనే చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని చేజేతులా ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆడా, మగ తేడాలేకుండా అక్రమ సంబంధాల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొన్నిసార్లు సభ్యసమాజమే తలదించుకునే వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.

26
ఉత్తర ప్రదేశ్ లో దారుణం

ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా సోనౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి ఓ మహిళ నివాసముంటుంది. ఇప్పటికే ఆమెకు పెళ్లయింది... అత్తావారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ ఇంటికి వచ్చే తన మామ స్నేహితుడితో ఆమె ప్రేమలో పడింది... అంతేకాదు అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తాజాగా ఈ విషయం బైటపడటంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

36
మామ స్నేహితుడితో కోడలు అక్రమ సంబంధం

ఓ వ్యక్తి కోసం తరచూ ఇంటికివచ్చే క్రమంలోనే స్నేహితుడికి అతడి కోడలితో పరిచయం పెరిగింది. మరీ దారుణం ఏంటంటే మామ ఫోన్ నుండే కోడలి మొబైల్ నెంబర్ తీసుకున్నాడు ఆ ప్రెండ్. ఇలా ఆమెకు ఫోన్ చేసి మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. మామ స్నేహితుడితో ప్రేమలో పడ్డ మహిళ చివరకు వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది.  

46
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్ట జంట

అయితే అత్తవారింట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ తన ప్రియుడిని పిలిచింది. వీరిద్దరు ఇంట్లో ఉండగా కుటుంబసభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చారు... దీంతో చాలాకాలంగా గుట్టుగా సాగుతున్న అక్రమ సంబంధం బైటపడింది. అయితే తన కోడలితో స్నేహితుడిని చూసి ఆశ్చర్యపోవడం సదరు మామ వంతయ్యింది.

56
అత్తామామలపైనే ఆరోపణలు

ఈ విషయం బయటపడితే కుటుంబం పరువు పోతుందని కోడలిని మందలించి ఆమె ప్రియుడిని అక్కడినుండి పంపించారు. తర్వాత కోడలి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కానీ ఆశ్చర్యంగా వాళ్లు తిరిగి అత్తమామల పైనే ఆరోపణలు చేశారు. తమ కూతురి పరువు తీయడానికి అత్తమామలు కుట్ర పన్నుతున్నారని వాళ్లు ఆరోపించారు. అందుకే తన స్నేహితుడితో మామ నాటకం ఆడిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

66
పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ

ఇలా ఇరు కుటుంబాల మధ్య ఈ అక్రమ సంబంధం వ్యవహారంపై కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం బయటకు రావద్దని అనుకున్నా ఈ గొడవల కారణంగా బైటపడింది. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో మామ స్నేహితుడితో కోడలి అక్రమం సంబంధం వ్యవహారం బైటపడింది. ఇరు కుటుంబాల వాదనను విన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు... మహిళతో పాటు మామ స్నేహితుడిని విచారించి అసలు నిజం తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories