కుటుంబ కలహాల కారణంగా భాగ్యశ్రీ అనే వివాహిత గత రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమె భర్త ప్రవీణ్ ఇటీవలే భార్యతో పాటు అత్తింటివారిని ఒప్పించి కాపురానికి తీసుకెళ్లాడు. భార్యను బాగా చూసుకుంటానని... ఎలాంటి గొడవలు జరగవని మాటిచ్చాడు. భర్త మాటలు నమ్మిన భాగ్యశ్రీ గత ఆదివారమే పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లింది.
అయితే భాగ్యశ్రీ ఇంటికి వచ్చిన రోజు సాయంత్రమే ప్రవీణ్ తో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు మానవ మ్రుగంగా మారాడు... కర్రతో విచక్షణారహితంగా భార్యను చితకబాదాడు... ఆ తర్వాత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఊపిరాడక ప్రాణాల కోసం పోరాడుతుండగా ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. వెంటనే భాగ్యశ్రీ తల్లిదండ్రులకు కాల్ చేసి, వాళ్ల కూతురు చనిపోతున్న దృశ్యాలను లైవ్‌లో చూపించాడు. ఈ వీడియోను తన స్నేహితులకు, బంధువులకు కూడా పంపాడు.
వారి పెళ్లి సమయంలో గోడపై రాసిన పేర్ల ముందే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించి, దర్యాప్తును వేగవంతం చేశారు.