Viral news: భార్యాభర్తల మధ్య ఏ విషయంలో గొడవలు వస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. కేవలం ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా భార్యా భర్తలకు విడాకులిచ్చింది కోర్టు. పైగా అది మానసిక క్రూరత్వమని చెప్పింది. ఇంతకీ వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోండి.
భార్యా భర్తల బంధం గట్టిదే కానీ అదేంటో కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న అంశాలకే విరిగిపోతుంది. టిఫిన్ బాగో లేదని, మ్యాగీ చేయలేదని కూడా విడిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. కేవలం, ఉల్లిపాయ, వెల్లుల్లి వల్ల ఇద్దరు భార్యభర్తల నూరేళ్ల జీవితం వేరు వేరు దారులు అయ్యాయి. అంతే కాదు చట్టబద్ధంగా కోర్టే వారికి విడాకులు ఇచ్చింది. ఉల్లిపాయ, వెల్లుల్లి వండకపోవడం వల్లే ఇద్దరు భార్యాభర్తలకు విడాకులు రావడం అందిరనీ ఆశ్చర్యపరుస్తోంది.
24
ఉల్లిపాయ తినలేదని
భార్యాభర్తల పేర్లను గోప్యంగా ఉంచుతున్నాము. వివరాల ప్రకారం ఆ భార్య తన ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని నిర్ణయించుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంట్లో వండే ప్రతి వంటకాలలో కూడా వీటిని వాడకూడదని ఆమె పట్టుబట్టింది. దీంతో ఆ భార్యా భర్తల తరచూ గొడవలు జరిగేవి. ఉల్లిపాయ లేని కూరలు బాగోవని భర్త వాదించేవాడు. కేవలం ఇంట్లో తరచూ గొడవలు జరిగడం వల్ల తనకు మానసిక ఒత్తిడి పెరిగిందని భర్త వాదించారు. భర్త చెబుతున్న ప్రకారం, ఆహారం తినడం అనేది వ్యక్తిగత ఇష్టంగా కాకుండా,ఇంటి కుటుంబ సభ్యుల ఇష్టం ప్రకారం ఉండాలని, అందరికీ నచ్చేలా వండాలని అభిప్రాయపడ్డారు. అంతే తప్ప తన మీద బలవంతంగా రుద్దిన నియమంగా ఉల్లిపాయ,వెల్లుల్లి మారిందని ఆయన చెప్పుకున్్నారు. దీంతో సాధారణ కుటుంబ జీవితం కూడా అసహనంగా మారి పోయిందని ఆ భర్త కోర్టుకు ఎక్కారు.
34
విడాకులు ఇచ్చేసిన కోర్టు
ఇక కోర్టు కూడా ఇలా బలవంతంగా ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ భర్తకు దూరం చేయడం మానసిక క్రూరత్వంగా పరిగణించవచ్చని కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కారణంతో భర్తకు విడాకులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. దంపతుల మధ్య రోజువారీ జీవనశైలికి సంబంధించిన చిన్న విషయాలు కూడా ఎంత పెద్ద వివాదాలకు దారి తీయగలవో ఈ కేసు ద్వారా తెలుస్తోంది. వివాహ జీవితంలో పరస్పర అవగాహన, సహనం ఎంత ముఖ్యమో భార్యభర్తలిద్దరూ అర్థం చేసుకోవాలి. ఈ కేసు మొదట కుటుంబ కోర్టుకు వెళ్లింది. భార్య ప్రవర్తన భర్తకు మానసిక వేధింపులుగా మారాయని నిర్ధారించింది. తరువాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. హైకోర్టు కూడా కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది.
ఈ తీర్పు తెలుసుకున్నాక భార్యాభర్తలు ఎంత జాగ్రత్తగా తమ బంధాన్ని కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ఆహార అభిరుచులు తప్పు కాదని, కానీ అవి కుటుంబంపై బలవంతంగా రుద్దడం మాత్రం మంచిది కాదు. అవి జీవితాన్ని దెబ్బతీసే స్థాయికి చేరితే సమస్యగా మారిపోవచ్చు. వివాహ బంధం నిలబడాలంటే భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారం, సర్దుబాటు చాలా అవసరం. చిన్న విషయాలకే గొడవలు పెరిగితే అవి చివరకు కోర్టు వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.