Condom Sale: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన 2025 ఇయర్ఎండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యావసరాల నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు ఈ రిపోర్ట్‌లో తేలిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈ రిపోర్ట్‌లో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం చెన్నైకి చెందిన ఒక యూజర్. 2025 ఏడాది పొడవునా అతడు కండోమ్స్‌పై మొత్తం రూ.1,06,398 ఖర్చు చేశాడు. 228 సార్లు వేర్వేరు ఆర్డర్లు పెట్టాడు. మొత్తం ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లలో ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్స్‌కు సంబంధించినదే కావడం గమనార్హం. సెప్టెంబరు నెలలో కండోమ్ అమ్మకాలు మిగతా నెలలతో పోలిస్తే 24 శాతం పెరిగాయి.
25
భారతీయుల మొదటి ఎంపిక పాలు
భారతీయుల రోజువారీ జీవితంలో పాలు ఎంత ముఖ్యమో ఈ రిపోర్ట్ మరోసారి రుజువు చేసింది. 2025లో ప్రతి సెకనుకు నాలుగు ప్యాకెట్లకు పైగా పాలను ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేశారు. ఈ మొత్తం పరిమాణం 26 వేలకుపైగా ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ నిండేంత ఉంటుందని సంస్థ తెలిపింది.
35
పెట్ కేర్, ఫిట్‌నెస్‌పై భారీ ఖర్చులు
పెంపుడు జంతువులపై ఖర్చు కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. చెన్నైకి చెందిన ఒక పెట్ పేరెంట్ ఒక్క ఏడాదిలోనే పెట్ ఉత్పత్తులపై రూ.2.41 లక్షలు ఖర్చు చేసి ‘పెట్ పేరెంట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు. ఇక ఫిట్‌నెస్ ప్రియులు కూడా వెనుకాడలేదు. ఎన్‌సీఆర్ ప్రాంతంలోని నోయిడాకు చెందిన ఒక యూజర్ 1,343 ప్రోటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేసి మొత్తం రూ.2.8 లక్షలు ఖర్చు చేశాడు.
క్విక్ కామర్స్ అంటే కేవలం కూరగాయలు, పాలు మాత్రమే అన్న భావనను ఇన్‌స్టామార్ట్ రిపోర్ట్ తుడిచిపెట్టింది. ముంబైకి చెందిన ఒక యూజర్ ఇన్‌స్టామార్ట్ ద్వారా రూ.15.16 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేశాడు. మరోవైపు బెంగళూరులో ఒక యూజర్ కేవలం రూ.10 విలువైన ఒక ప్రింటౌట్ ఆర్డర్ చేసి ఈ ఏడాది అతి చిన్న కార్ట్‌గా నిలిచాడు.
55
మారుతున్న అలవాట్లు
ఈ ఏడాది డేటా చూస్తే భారతీయులు ఇన్‌స్టామార్ట్‌ను నిత్యావసరాలకే కాదు, ప్రత్యేక అవసరాలు, లగ్జరీ కొనుగోళ్లకూ వాడుతున్నట్టు స్పష్టమవుతోంది. చిన్న అవసరాల నుంచి పెద్ద ఖర్చుల వరకు అన్నీ ఒకే యాప్‌లో చేయడం ఇప్పుడు సాధారణంగా మారింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 2025 రిపోర్ట్ భారతీయుల వినియోగ ధోరణిలో వచ్చిన ఈ మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.