చక్ర సిరీస్ అవార్డు గ్రహీతలకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం 1996 నుంచే అమల్లో ఉంది.
గతంలో వీరు తమ కాంప్లిమెంటరీ కార్డ్ పాస్‌లతో సహచరుడితో కలిసి ప్రయాణించే వీలు ఉండేది, అలాగే 2012–2014 మధ్య కాలంలో క్యాటగిరీలను బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, రాజధాని/శతాబ్ది/దురంతో వంటి రైళ్లలోనూ వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు వందే భారత్‌తో సహా అన్ని రైళ్లకు ఈ పాస్‌ను వర్తింపజేయడం విశేషం. అయితే గతంలో ఉన్న క్లాస్ అర్హతలు, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశ యోధుల ధైర్యం, త్యాగం, సేవలను గౌరవించడంలో రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖల ఉమ్మడి నిబద్ధతను ఈ నిర్ణయం చాటి చెబుతోంది అంటూ.. ఇండియన్ ఆర్మీ.. ట్విట్టర్ (ఎక్స్) లో పేర్కొన్నారు.
ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఎవరికి దక్కుతుంది..?
స్వాతంత్ర్యం తర్వాత జనవరి 26, 1950న తొలిసారి పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర పురస్కారాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరికొన్ని అవార్డులను చేర్చారు. అవి ఇవే.. పరమవీర చక్ర (Param Vir Chakra)
అశోక చక్ర (Ashoka Chakra)
మహావీర చక్ర (Mahavir Chakra)
కీర్తి చక్ర (Kirti Chakra)
వీర చక్ర (Vir Chakra)
శౌర్య చక్ర (Shaurya Chakra)
ఈ అవార్డుల ప్రత్యేకత..
చక్ర సిరీస్‌లోని ఆరు పురస్కారాలు వేర్వేరు సందర్భాల్లో చూపే ధైర్యానికి గుర్తింపుగా ఇస్తారు:
యుద్ధ సమయంలో శౌర్యానికి: పరమవీర చక్ర (PVC), మహావీర చక్ర (MVC), వీర చక్ర (Vir Chakra).
శాంతికాలంలో (కౌంటర్-టెర్రరిజం, ఇతర ఆపరేషన్లలో) సాహసానికి: అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర.
2026 మార్చిలో సైనిక, నౌకా, వాయుసేన శౌర్య పతకాల గ్రహీతలకు కూడా జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని (ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఏసీ చైర్ కార్‌లో సహచరుడితో పాటు, IRCCP పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌తో) ప్రభుత్వం విస్తరించింది. ఇప్పుడు చక్ర సిరీస్ అవార్డు గ్రహీతలకు కూడా అన్ని రైళ్లలో వందే భారత్ సహా సదుపాయం అందడం విశేషం.