రూ.35 లక్షల శాలరీ జాబ్ వదులుకుని ఆధ్యాత్మిక మార్గం పట్టి వైరల్ అయిన 'ఐఐటీ బాబా' అభయ్ సింగ్ గుర్తున్నాడా..? ఇప్పుడతను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంజినీర్ ప్రతీకను వివాహం చేసుకున్నాడు. ఇంతకీ వాళ్ల లవ్‌స్టోరీ ఎలా మొదలైందో చూద్దాం…
గతేడాది జరిగిన ప్రయాగరాజ్ మహా కుంభమేళా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కుంభమేళాలో మెరిసిన మొనాలిసా ఇటీవలే ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కుంభమేళా ద్వారా గుర్తింపుపొందిన 'ఐఐటీ బాబా' కూడా వార్తల్లో నిలిచారు.
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలో చదివి, రూ.35 లక్షల జీతం గత జాబ్ చేస్తూ సడన్ గా ఆధ్యాత్మిక బాట పట్టిన అభయ్ సింగ్ ప్రయాగరాజ్ లో కనిపించాడు. కాషాయ వస్త్రాల్లో బాబాగా కనిపించిన అతడు ఇప్పుడు బెంగళూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్లీ వార్తల్లో నిలిచాడు.
ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదివిన అభయ్ సింగ్, హరియాణాలోని ఝజ్జర్ వాసి. మహాకుంభ్‌లో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఇతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్నుంచి ఇతను ఐఐటీ బాబాగా ఫేమస్ అయ్యాడు. అయితే కుంభమేళా తర్వాత అభయ్ సింగ్ ఎక్కడా కనిపించలేదు. కానీ సడన్ పెళ్లి చేసుకోవడంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు.
25
ఐఐటి నుండి బాబా వరకు..
అభయ్ సింగ్ చిన్నప్పటి నుంచీ టాపర్. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లో 93%, 12వ తరగతిలో 92.4% మార్కులు సాధించాడు. 2008లో జరిగిన ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 731వ ర్యాంక్ (AIR) సాధించి, ఐఐటీ బాంబేలో సీటు సంపాదించాడు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, కెనడాలో మూడేళ్లు ఉద్యోగం చేశాడు. అక్కడ అతని వార్షిక జీతం రూ.36 లక్షలు. కానీ, అతనికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది.
35
ఆద్యాత్మిక బాటలో అభయ్ సింగ్
కెనడాలో మూడేళ్లు ఉద్యోగం చేశాక, అజయ్ సింగ్‌కు ఆధ్యాత్మికతపై మనసు మళ్లింది. భౌతిక సుఖాలు, సంపద నిజమైన సంతృప్తిని ఇవ్వవని అతను నమ్మాడు. అందుకే అన్నింటినీ వదిలేసి, అంతర్గత శాంతిని వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే అభయ్ సింగ్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజినీర్ ప్రతీకను అతను వివాహం చేసుకున్నాడు. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? ప్రేమ ఎలా మొదలైంది? అనే ప్రశ్నలకు ఈ జంటే సమాధానం ఇచ్చింది.
గత ఏడాదే వీళ్లిద్దరూ కలుసుకున్నారు. 2025 ప్రారంభంలో కోయంబత్తూర్‌లోని సద్గురు ఆదియోగి ఆశ్రమంలో వీరిద్దరూ మొదటిసారి కలిశారు. ఇద్దరికీ ఆధ్యాత్మిక భావాలు ఉండటంతో స్నేహితులయ్యారు. ఆ స్నేహమే ప్రేమగా మారింది.
55
గత ఫిబ్రవరి 15న, మహాశివరాత్రి రోజున హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఎనిమిది నెలల తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి బంధంతో ముగించారు. అభయ్ సింగ్ చాలా సింపుల్ వ్యక్తి అని అతని భార్య ప్రతీక చెప్పింది. "అతను చాలా నిజాయితీపరుడు. మేమిద్దరం కలిసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తాం. భవిష్యత్తులో 'శ్రీ విశ్వవిద్యాలయం' పేరుతో ఓ యూనివర్సిటీని స్థాపించాలని ఆలోచిస్తున్నాం" అని ప్రతీక తెలిపింది.
పెళ్లి తర్వాత ఐఐటీ బాబా తన భార్య ప్రతీకతో కలిసి సొంతూరు ఝజ్జర్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ అతని తల్లి, కోడలికి హారతి ఇచ్చి, స్వీట్లు తినిపించి స్వాగతం పలికింది. వారిని చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు చుట్టుపక్కల జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.