DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఈ మార్చి శాలరీ మామూలుగా ఉండదు, డబ్బులే డబ్బులు

Published : Mar 12, 2026, 07:42 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపు, కరవు భత్యం (DA) పెంపు, బకాయిల చెల్లింపు వంటి శుభవార్తలు అందనున్నాయి. ఏ స్థాయిలో జీతాలు పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?

PREV
16
డీఏ పెంపు ఎప్పుడు..?

కేంద్రం ప్రభుత్వం ప్రతి ఏడాది రెండుసార్లు ఉద్యోగులకు డీఏ పెంచుతుంది. ఈ క్రమంలో జనవరి-జూన్ 2026 సైకిల్‌కు సంబంధించిన డీఏ, డీఆర్ పెంపు కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి డీఏను మార్చిలో హోలీకి, జులై డీఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దసరా/దీపావళికి ప్రకటిస్తారు.

26
ఎందుకు ఆలస్యం?

అయితే జనవరి 2026 డీఏ పెంపు ప్రకటన మార్చిలో హోలీ పండగ నాడే వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ ప్రకటన ఆలస్యమైంది. ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక సమాచారం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అసలు డీఏను బేసిక్ జీతంలో విలీనం చేస్తారా అనే చర్చ కూడా మొదలైంది.

36
2% పెరగనున్న కరవు భత్యం?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డీఏ అందుకుంటున్నారు. ద్రవ్యోల్బణ డేటా ఆధారంగా జనవరి 2026లో డీఏ సుమారు 2% పెరగొచ్చని అంచనా. అదే జరిగితే మొత్తం డీఏ 60%కి చేరుకుంటుంది. ఈ అంచనా జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 12 నెలల సగటుపై ఆధారపడి ఉంటుంది. లెక్కల ప్రకారం డీఏ 60.33% వస్తుండగా, దాన్ని 60%గా రౌండ్ ఫిగర్ చేస్తారు.

46
శాాలరీ ఎంత పెరుగుతుంది?

మార్చి 18 లేదా 25న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. దీని ప్రకారం డీఏ 2% పెరిగి 60%కి చేరనుంది. డీఏ పెరిగితే జీతాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు బేసిక్ జీతం రూ.20,000 అయితే మొత్తం జీతం రూ.32,000 అవుతుంది. మార్చి చివరికల్లా డీఏ పెంపు జరగొచ్చని, జనవరి నుంచి రావలసిన బకాయిలు మార్చి జీతంతో కలిపి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

56
ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే...

డీఏను బేసిక్ జీతంతో విలీనం చేస్తే ఉద్యోగులకు చాలా లాభాలుంటాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీనివల్ల బేసిక్ జీతం, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ఇతర అలవెన్సులు పెరుగుతాయి. పెన్షన్ లెక్కింపులోనూ ప్రత్యక్ష ప్రయోజనం ఉంటుంది. 8వ వేతన సంఘం అమలు చేసే వరకు ఉపశమనంగా దీన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ప్రస్తుతం 8వ వేతన సంఘం పనులు ప్రారంభించింది. దీని పూర్తిస్థాయి అమలుకు మరికొంత సమయం పట్టొచ్చు.

66
కేంద్రం వైఖరి ఇదే..
డీఏ 50% దాటితే దాన్ని బేసిక్ జీతంతో కలపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ, డీఏను బేసిక్ జీతంతో కలిపే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. ఆరు నెలలకు ఒకసారి డీఏను సవరించే ప్రస్తుత విధానమే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పెద్దగా మార్పులు అవసరం లేదన్నది ప్రభుత్వ వైఖరి.
Read more Photos on
click me!

Recommended Stories