Cheap Flights : యుద్దం ఎఫెక్ట్ తో పెరిగిన విమాన చార్జీలు.. అయినా 40% డిస్కౌంట్ తో టికెట్ పొందే చిట్కాలివే

Published : Mar 12, 2026, 07:04 PM IST

మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్‌తో ఎయిర్ ఇండియా ఫ్యూయల్ సర్‌చార్జిని భారీగా పెంచింది. మార్చి 12 నుంచి టికెట్లపై రూ.399 నుంచి రూ.8000 వరకు అదనపు భారం పడనుంది. ఈ సమయంలోనూ కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో విమాన టికెట్లను 40% వరకు తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు.   

PREV
16
1. మార్చి 'డెడ్‌లైన్' అవకాశాన్ని వాడుకోండి

దేశీయ ప్రయాణాలకు మార్చి 12, అంతర్జాతీయ ప్రయాణాలకు మార్చి 18 లోపు టికెట్లు బుక్ చేసుకుంటే కొత్త ఛార్జీలు వర్తించవని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మీరు ఆలోపు టికెట్ బుక్ చేసుకుంటే నేరుగా రూ.400 నుంచి రూ.8,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

26
2. వారం మధ్యలో లేదా అర్ధరాత్రులు టికెట్ బుక్ చేయండి

ఎక్కువ మంది వీకెండ్ లో అంటే శుక్రవారం, ఆదివారం విమాన టికెట్లు బుక్ చేస్తారు… కాబట్టి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఎయిర్‌లైన్స్ డేటా ప్రకారం మంగళ, బుధవారాల్లో విమాన ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అలాగే రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య బుక్ చేస్తే, క్యాన్సిల్ అయిన సీట్లు తక్కువ ధరకే దొరికే అవకాశం ఎక్కువ. ఈ అవకాశాన్ని వాడుకుంటే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. 

36
3. ఇంకోగ్నిటో మోడ్ వాడండి

మీరు టికెట్ ధరను ఎక్కువగా వెతికితే ధర పెరగడం గమనించారా?  ఎందుకంటే ఎయిర్‌లైన్స్ మీ కుకీస్‌ను ట్రాక్ చేస్తాయి. అందుకే బుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ బ్రౌజర్‌లో 'ఇంకోగ్నిటో మోడ్' ఆన్ చేయండి. దీనివల్ల మీరు టికెట్ కోసం ఆత్రంగా ఉన్నారని ఎయిర్‌లైన్‌కు తెలియదు, పాత తక్కువ ధరనే చూపిస్తుంది.

46
4. ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్ పై ఓ కన్నేయండి

ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూప్ మాత్రమే ఫ్యూయల్ సర్‌చార్జిని ప్రకటించింది. ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ వంటివి ఇంకా అంత పెద్దగా ధరలు పెంచలేదు. బుక్ చేసే ముందు 'గూగుల్ ఫ్లైట్స్'లో అన్ని ఎయిర్‌లైన్స్ ధరలను పోల్చి చూడండి. వేరే ఎయిర్‌లైన్‌లో మీకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నేరుగా ఆదా కావచ్చు. అంటే మీ టికెట్ ధర రూ.5,000 అయితే ఇందులో రూ.2,000 ఆదా అయినా 40% వరకు తగ్గింపు లభించినట్లే.

56
5. క్రెడిట్ కార్డ్, రివార్డ్ పాయింట్ల ప్రయోజనం

ఈ రోజుల్లో దాదాపు ప్రతి బ్యాంకు (SBI, HDFC, ICICI) క్రెడిట్ కార్డులపై ట్రావెల్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. టికెట్ బుక్ చేసేటప్పుడు 'జీరో కన్వీనియన్స్ ఫీ' ప్రోమో కోడ్‌ల కోసం వెతకండి. మీ దగ్గర రివార్డ్ పాయింట్లు ఉంటే వాటిని వాడటానికి ఇదే సరైన సమయం. చాలా కార్డులు నేరుగా 10-15% క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి.

66
ఫ్యూయల్ సర్‌చార్జ్‌తో ఎయిర్ ఇండియా టికెట్స్ ఎంత పెరిగాయి?

చమురు (ATF) ధరలు పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది. దేశీయ ప్రయాణాల్లో ప్రతి టికెట్‌పై రూ.399 భారం పడుతుంది. సార్క్ దేశాలకు వెళ్లాలన్నా అదనంగా రూ.399 చెల్లించాలి. సింగపూర్, ఆగ్నేయాసియా ప్రయాణాలపై రూ.1,600 నుంచి రూ.5,000 వరకు పెరుగుతుంది. యూరప్, అమెరికా వెళ్లేవారు మార్చి 18 నుంచి రూ.4,000 నుంచి రూ.8,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డిస్‌క్లెయిమర్: ఈ ఆర్టికల్ కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. విమాన టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చు. ఇక్కడ చెప్పిన టిప్స్ అన్ని సందర్భాల్లోనూ పనిచేయకపోవచ్చు. ఏదైనా నష్టానికి రచయిత లేదా వెబ్‌సైట్ బాధ్యత వహించదు. మీ అవసరాలకు అనుగుణంగానే బుకింగ్ చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories