పప్పు ధాన్యాలపై మోదీ సర్కార్ స్పెషల్ ఫోకస్ :
భారతీయులు ఎక్కువగా పప్పులను ఆహారంగా ఉపయోగిస్తుంటారు... కానీ దేశంలో రోజురోజుకు పప్పుధాన్యాల పంటలు తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో పప్పుధాన్యాల కొరత ఏర్పడే అవకాశం వుంది... అంతేకాదు వాటి ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు దూరం కావచ్చు. దీన్ని దృష్టిలో వుంచుకునే పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే పథకానికి శ్రీకారం చుట్టింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 'మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్' గురించి ప్రస్తావించారు. అంటే రాబోయే ఆరేళ్ళ కాలానికి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోనుంది కేంద్రం. పప్పుధాన్యాలను పండించేలా రైతులను ప్రోత్సహించడం, ఆ పంటలకు మంచి ధర వచ్చేలా చూడటం, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా విత్తనాలను తయారుచేసి అందించడం వంటి చర్యలు చేపడతారు.
ఇలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా దేశంలో వీటి కొరతను నివారించవచ్చు... అలాగే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇలా కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు వంటి ధాన్యాల ఉత్పత్తిని పెంచనున్నారు.
ఇవి కూడా చదవండి :
రైతుల అకౌంట్లో డబ్బులే డబ్బులు ... రైతు భరోసాకు ఇంకో రూ.2,000 కలిస్తే పండగేగా...
మీ అకౌంట్లో ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదా? కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి?