గాంధీ అంతిమ యాత్ర
గాంధీ తుదిశ్వాస విడిచిన తర్వాత గాంధీ భౌతికకాయాన్ని బిర్లా హౌస్‌లో సంప్రదాయ ధోతితో కప్పారు. భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రేడియో ప్రసంగంలో, "జాతిపిత ఇక లేరు. మేము వెలుతురును కోల్పోయాం" అని అన్నారు. గాంధీ భౌతికకాయాన్ని భారత జాతీయ పతాకంతో కప్పి, సైనిక వాహనంలో యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లారు. లక్షలాది మంది ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో దహనం చేశారు.
దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు..
గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే దేశంలో వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా ముంబయిలో అల్లర్లు, హింసాత్మక దాడులు జరిగాయి. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని కొంతమంది దాడులకు దిగారు. గాంధీజీ మృతితో భారతదేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది. ఆయన లేకపోయినా.. ఆయన పాటించిన అహింస, శాంతి, సహన సిద్దాంతాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.