Bank Holidays : బ్యాంకులకు 4 రోజులు సెలవులు.. రేపట్నుంచే ప్రారంభం.. ఎందుకో తెలుసా?

Published : Feb 17, 2026, 05:58 PM ISTUpdated : Feb 17, 2026, 06:13 PM IST

ఈ వారం బ్యాంకులకు మొత్తం 4 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకు పనులు ఉన్నవాళ్లు ముందుగానే ఈ సెలవుల జాబితా చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది... దీనివల్ల మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. 

PREV
14
రాబోయే నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays : బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు అనగానే కంగారుపడిపోకండి. ఒకే రాష్ట్రంలో వరుస సెలవులు లేవు… ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరోజు సెలవులున్నాయి. కాబట్టి ఈవారం ఆర్థిక లావాదేవీలు లేదంటే మరేదైనా పనికోసం బ్యాంకులకు వెళ్లాలనుకునే ఏ రాష్ట్రంలో ఏరోజు సెలవుందో తెలుసుకోవడం ఉత్తమం. సెలవు లేని రోజు బ్యాంకుకు వెళ్లి పని పూర్తిచేసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2026 హాలిడేస్ జాబితా ప్రకారమే బ్యాంక్ సెలవులు అమలవుతాయి. ఇలా రేపట్నుంచి (ఫిబ్రవరి 18) నాలుగు రోజులు వరుసగా సెలవులున్నాయి. ఏరోజు ఏ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం. 

24
మహారాష్ట్ర, సిక్కింలో సెలవులు

ఫిబ్రవరి 18న కేవలం సిక్కింలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. లోసార్ పండుగ అంటే బౌద్దుల నూతన సంవత్సరాది సందర్భంగా ఈ సెలవు ఉంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకులు మామూలుగానే పనిచేస్తాయి. 

ఇక ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ఉంది. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మహారాష్ట్ర ప్రజలు చాలా ఘనంగా జరుపుకుంటారు. అందుకే బ్యాంకులు కూడా మూతపడనున్నాయి.  

34
అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో బ్యాంకులకు సెలవు

ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవం ఒకేరోజు… అందుకే సెలవు కూడా ఒకేరోజు వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని బ్యాంకులు మినహా ఇతర రాష్ట్రాల్లో యధావిధిగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి.

44
ఫిబ్రవరి 22న దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవు

ఫిబ్రవరి 20న బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి.. మళ్లీ ఫిబ్రవరి 22 ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది కాబట్టి కార్యకలాపాలు సాగవు. 

ఇలా వరుసగా 4 రోజులు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. అత్యవసరం అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories