Viral Video: టీచ‌ర‌మ్మ స్టెప్పులు చూస్తే పిచ్చెక్కాల్సిందే.. ముక్కాబులా పాట‌కు డ్యాన్స్ ఫ్లోర్ షేక్

Published : Feb 17, 2026, 01:58 PM IST

Viral Video: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. తాజాగాఓ టీచ‌ర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఏంటా వీడియో.? అందులో అంత‌లా ఏముందంటే.? 

PREV
15
స్కూల్ వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ

స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు టీచర్ కూడా స్టేజ్ మీదకు వచ్చారు. అయితే ఆమె ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని అక్కడ ఎవరూ ఊహించలేదు. మొదట విద్యార్థులతో సరదాగా మొదలైన స్టెప్స్, తర్వాత పూర్తి స్థాయి ప్రదర్శనగా మారాయి.

25
ముక్కాబులా పాట‌కు పవర్‌ఫుల్ స్టెప్స్

డీజేలో ముక్కాబులా పాట ప్లే అవుతుండగా టీచర్ స్టేజ్ మీద దుమ్మురేపారు. ఈ పాటకు డ్యాన్స్ చేయడం అంత సులభం కాదు. వేగంగా మారే స్టెప్స్, ఎనర్జీతో కూడిన మూవ్స్ చేయాలి. కానీ ఆమె చాలా సులభంగా, ఆత్మవిశ్వాసంతో స్టెప్స్ వేశారు. అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.

35
ప్ర‌భుదేవ ఎన‌ర్జీ

ఈ పాట‌కు సినిమాలో ప్ర‌భుదేవా కొరియోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ పాట వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తోన్నా ఇప్ప‌టీకీ యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఇక ఈ వీడియోలో టీచ‌ర్ కూడా అదే స్థాయిలో ఎనర్జీ చూపించారు. ముఖ్యంగా సారీ ధరించి అంత వేగంగా స్టెప్స్ వేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

45
సారీతోనే అదిరిపోయే డ్యాన్స్

సాధారణంగా ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలకు జిమ్ డ్రెస్సులు లేదా కంఫర్ట్ బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తారు. కానీ ఈ టీచర్ సంప్రదాయ దుస్తులైన సారీతోనే అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. సంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ ప్రదర్శన అందరికీ నచ్చింది. అందుకే ఈ వీడియో మరింతగా వైరల్ అవుతోంది.

55
నెటిజన్ల ప్రశంసలు, వైరల్ రియాక్షన్లు

ఈ వీడియోను కొంతమంది మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది. “ప్రభుదేవకే సరిపోయే స్టెప్స్”, “టీచర్ సూపర్ ఎనర్జీ”, “ఇలాంటి టీచర్ ఉంటే క్లాస్ మిస్ అవ్వం” అంటూ నెటిజన్లు స‌రాదాగా కామెంట్లు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories