NHAI
National Highways Helpline : దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటపుడు ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. కొత్త ప్రదేశాల్లో ఏది ఎక్కడుందో మనకు తెలియదు... ఇలాంటప్పుడు పెట్రోల్ బంక్ కనుక్కోవడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ అయిపోయి రోడ్డుపై నిడబడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏంచేయాలి? ఎవరి సహాయం తీసుకోవాలి? అనేది అంతుచిక్కకుండా ఉంటుంది.
అయితే జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో ఇలాంటి సమస్య ఎదురైతే ఏం చింతించకండి. వాహనాన్ని తోసుకుంటూ వెళ్లడం లేదంటే ఇతర వాహనదారుల సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు... మనం ఎక్కడుంటే అక్కడికే పెట్రోల్ తెప్పించుకోవచ్చు. ఇండియన్ నేషనల్ హైవే అథారిటీ (NHAI) హెల్ప్‌లైన్ నంబర్ 1033 కి కాల్ చేసి ఈ సహాయం పొందవచ్చు.
NHAI
కేవలం NHAI హెల్ప్ లైన్ నంబర్ కే కాదు మరికొన్ని నంబర్లకు ఫోన్ చేసికూడా సహాయం పొందవచ్చు. 8577051000 లేదా 7237999944 - పెట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. మీ లొకేషన్, పేరు చెప్పి ఈ సహాయం పొందవచ్చు. సహాయకులు మీ దగ్గరికి వచ్చి పెట్రోల్/డీజిల్ ఇస్తారు... వారికి ఈ ఇంధనానికి సంబంధించిన డబ్బులు మాత్రమే చెల్లించాలి, అదనపు ఛార్జీలు ఉండవు.
NHAI
ఇలా చేయండి
ముందుగా వాహనాన్ని పక్కకు ఆపి టోల్ రశీదులో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ లేదా 1033 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. మీ లొకేషన్, పేరు చెప్పండి. సహాయకులు మీ దగ్గరికి వచ్చి పెట్రోల్/డీజిల్ ఇస్తారు. ఈ నంబర్లను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. డ్రైవర్లకు సహాయం చేయడానికి అన్ని టోల్ ప్లాజాలలో అంబులెన్స్‌లు, రికవరీ వ్యాన్లు, సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయి. టోల్ ప్లాజా దాటిన తర్వాత, మీకు ఇచ్చే రశీదులో NHAI టోల్ ఫ్రీ నంబర్ 1033 ఉంటుంది.
NHAI
ఈ నంబర్ ఫాస్టాగ్‌కూ ఉపయోగపడుతుంది
టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ పనిచేయకపోతే, కస్టమర్ 1033 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫాస్టాగ్ సహా హైవే వినియోగదారులకు అన్ని రకాల రోడ్డు సహాయం అందించడానికి NHAI 1033 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.