కాబోయే అల్లుడితో అత్త జంప్ :
ఉత్తర ప్రదేశ్ అలీఘర్ సమీపంలోని దాదోన్ లో జితేంద్ర కుమార్, సప్న దంపతులు నివాసం ఉండేవారు. వీరికి శివానీ అనే పెళ్లీడు కూతురు ఉంది. కూతురికి పెళ్లి చేయాలని భావించిన ఈ దంపతులకు రాహుల్ కుమార్ అనే యువకుడు బాగా నచ్చాడు. కూతురికి కూడా అతడు నచ్చడంలో పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 16న పెళ్లికి మూహూర్తం కూడా పెట్టుకున్నారు.
అయితే కూతురికి కాబోయే భర్తపై సప్న మనసు పారేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఆమె వావివరసలు మరిచి కాబోయే అల్లుడిని లొంగదీసుకుంది. మాయమాటలతో 20 ఏళ్ల యువకుడిని వలలో వేసుకున్న ఈ కిలాడీ లేడీ కూతురు జీవితంతో ఆడుకుంది.
మరో పదిరోజుల్లో కూతురు పెళ్లి అనగా అంటే ఈ నెల 6న కాబోయే అల్లుడితో పరారయ్యింది. పెళ్లి బట్టలు కొనేందుకు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లిన వీరిద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం రాహుల్ తన తండ్రికి ఫోన్ చేసి కాబోయే అత్తతో కలిసి వెళ్లినట్లు... ఇక తిరిగిరానని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అత్తా అల్లుడు లేచిపోయిన వ్యవహారం ఇటీవల ఉత్తరప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సప్న భర్త జితేంద్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కూతురు పెళ్లికోసం దాచిన భారీ నగదు, బంగారు నగలతో భార్య పరారయినట్లు అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.