భౌతికంగా పట్టుకోవడమే కాకుండా ఎలక్ట్రానిక్ దాడి చేయగల జ్యామర్ వ్యవస్థ కూడా ఇందులో ఉండాలి.
* ఆర్‌ఎఫ్ సిగ్నల్ నిలిపివేయడం
* జీపీఎస్ (GNSS) సిగ్నల్‌ను అడ్డుకోవడం
* తప్పుదారి పట్టించే సిగ్నల్ పంపడం
* సాధారణ, అసాధారణ ఫ్రీక్వెన్సీలలో పనిచేయడం
* డ్రోన్లు ఒక్కొక్కటిగా కాకుండా గుంపులుగా వచ్చినా వాటిని ఎదుర్కొనే విధంగా ఈ సిస్టమ్ ఉండాలి.
ఈ వ్యవస్థ అవసరం ఏంటి.?
తక్కువ RCS ఉన్న డ్రోన్లు సైనిక స్థావరాలు, కీలక మౌలిక వసతులపై దాడి చేసే ప్రమాదం పెరిగింది. ఇటీవలి ఆపరేషన్లలో డ్రోన్ల వినియోగం స్పష్టంగా కనిపించింది. అందుకే భారత సైన్యం కోసం ప్రత్యేక డ్రోన్ క్యాచర్ సామర్థ్యం అభివృద్ధి చేయడం అత్యవసరమైంది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే దేశ భద్రతా వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది.