రైలు టికెట్, భోజనం అంతా సొంత డబ్బుతోనే..ఇందుకే కదా కలాం ది గ్రేట్ అనేది

Published : Oct 25, 2025, 06:43 PM IST

ఏపీజే అబ్దుల్ కలాం తన బంధువులపై చూపిన ప్రేమ, ఆయన నిరాడంబరత, రాష్ట్రపతి భవన్‌లో తన సొంత ఖర్చులతో కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం. కలాం జీవితానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
ఏపీజే అబ్దుల్ కలాం, కుటుంబంపై ప్రేమ

ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త, రాష్ట్రపతి అయినా, ఏపీజే అబ్దుల్ కలాంను మనవళ్లు ప్రేమగా 'రాకెట్ తాత' అని పిలిచేవారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక అక్క ఉన్నారు. అబ్ధుల్ కలాం మనువడు అజ్మల్ ఖాన్.. ఏషియా నెట్ తమిళ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన తాతకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అజ్మల్ ఖాన్ తెలిపిన వివరాలు వారి మాటల్లో.. 

26
అబ్దుల్ కలాంతో జ్ఞాపకాలు

నేను అజ్మల్ ఖాన్, ముస్తఫా కమల్ మనవడిని. ఎన్నో న్యూస్ ఛానళ్లలో పనిచేశాను. మా అమ్మకు చిన్నాన్న, నాకు ప్రియమైన తాత అయిన అబ్దుల్ కలాంతో నా జ్ఞాపకాలను పంచుకోవడం గర్వంగా ఉంది.

36
అబ్దుల్ కలాం పరిశోధన విజయం

ఇస్రోలో కలాం SLV-3 విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇది PSLV అభివృద్ధికి పునాది వేసింది. అందుకే మేమంతా ఆయన్ని 'రాకెట్ తాత' అని పిలిచేవాళ్ళం. టీవీలో రాకెట్ వార్త వస్తే ఆయనే గుర్తొచ్చేవారు.

46
అబ్దుల్ కలాం సలహా

కలాంను కలిసినప్పుడల్లా 'బాగా చదువు' అని సలహా ఇచ్చేవారు. తన జీతంతోనే అన్నల కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. మగపిల్లలు వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఆర్థికంగా సహాయం చేశారు.

56
రాష్ట్రపతి భవన్‌లో అబ్దుల్ కలాం బంధువులు

భారతరత్న అందుకున్నప్పుడు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కలాం తన బంధువులను ఢిల్లీకి పిలిపించారు. 2006లో 55 మంది కుటుంబ సభ్యులను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించి స్వయంగా స్వాగతం పలికారు.

66
మొత్తం ఖర్చులు ఆయనే భరించారు

సుమారు 7 రోజులు రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ఆ రోజులు మర్చిపోలేనివి. మాకు ప్రత్యేక గదులు, సిబ్బందిని కేటాయించారు. బంధువుల ప్రయాణ, భోజన, వసతి ఖర్చులన్నీ కలాం తన సొంత జీతంతోనే భరించారు.

Read more Photos on
click me!

Recommended Stories