Airport Jobs : కేవలం టెన్త్ చదివితే చాలు.. నెలకు ఐదంకెల జీతంలో ఎయిర్ పోర్టులో జాబ్స్

Published : Sep 20, 2025, 06:51 PM IST

Airport Jobs: ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో 1446 ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. కేవలం 10, 12వ తరగతి పాసైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

PREV
15
ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు

Airport Jobs : కొందరు యువతీయువకులకు విమానాశ్రయంలో పనిచేయాలనే కల ఉంటుంది.. కానీ పెద్దగా చదువు ఉండదు. అలాంటి యువతకు అద్భుత అవకాశం వచ్చింది. వారి కలను నిజం చేసేలా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానయాన సేవలు (IGI ఏవియేషన్ సర్వీసెస్) సంస్థ 1446 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కేవలం టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ అద్భుతమైన అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

25
ఈ ఉద్యోగులకు సాలరీ ఎంతుంటుంది?

ఈ నోటిఫికేషన్ కింద ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్స్ అనే రెండు ముఖ్యమైన పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు 1017, లోడర్స్ పోస్టులు 429 ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు ₹15,000 నుండి ₹35,000 వరకు జీతం ఇస్తారు.

35
ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలకు విద్యార్హతలు

ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస విద్యార్హత టెన్త్ (10వ తరగతి) లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాసై ఉండాలి. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగానికి 12వ తరగతి, లోడర్స్ ఉద్యోగానికి 10వ తరగతి పాసైతే చాలు. వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రెండు పోస్టులకు ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు.

45
ఎంపిక విధానం

అభ్యర్థులను రాత పరీక్ష, వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు గ్రౌండ్ స్టాఫ్‌కు ₹350, లోడర్స్ ఉద్యోగానికి ₹250. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకుంటారు.

55
దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడు?

దరఖాస్తులు ఇప్పటికే మొదలయ్యాయి, అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21, 2025. అభ్యర్థులు https://igiaviationdelhi.com/ అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలను నిర్ధారించుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories