Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు

Published : Sep 17, 2026, 12:36 PM IST

Air Pollution: వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలనే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడించారు. ఆ షాకింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
డిప్రెషన్ మాత్రమే కాదు.. ఊపిరి పీల్చే గాలి కూడా ఆత్మహత్యలకి కారణమేనా?

బాస్‌ల ప్రెజర్, ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్, పర్సనల్ లైఫ్ టెన్షన్స్.. మనోళ్లు డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి ఇవే రీజన్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మనం పీల్చే గాలి కూడా మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోందట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. మన చుట్టూ పెరుగుతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులు, గుండెకే కాదు.. చివరికి ప్రాణాలు తీసుకునే ఆలోచనలు రావడానికి కూడా ఒక కారణం అవుతోందని ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ వెల్లడించింది.

'జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్' లో పబ్లిష్ అయిన ఈ స్టడీ ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. క్వీన్స్ యూనివర్సిటీ బెలఫాస్ట్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 29 అధ్యయనాలను లోతుగా విశ్లేషించి (మెటా-అనాలిసిస్) ఈ సంచలన విషయాలను బయటపెట్టారు.

24
సైలెంట్ కిల్లర్స్: పీఎం 2.5, నైట్రోజన్ డయాక్సైడ్

మనం రోజూ సిటీ రోడ్లపై చూసే పొగ, దుమ్ము వెనుక ఎంత పెద్ద డేంజర్ దాగుందో ఈ రీసెర్చ్ తేల్చింది. గాలిలో తేలియాడే అతి సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5) అలాగే వాహనాల పొగ నుంచి వచ్చే నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) వల్ల ఆత్మహత్యాయత్నాలు, డిప్రెషన్ ఆలోచనలు విపరీతంగా పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. పీఎం 2.5 ఎంత చిన్నగా ఉంటుందంటే.. శ్వాస ద్వారా నేరుగా మన ఊపిరితిత్తులు, బ్లడ్‌లోకి ఈజీగా వెళ్లిపోతుంది. ఇవే కాకుండా సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, సౌండ్ పొల్యూషన్ కూడా సైకలాజికల్ హెల్త్‌ను డ్యామేజ్ చేస్తున్నాయని తేలింది. అయితే లైట్, వాటర్ పొల్యూషన్ ప్రభావంపై మాత్రం క్లారిటీ రాలేదు.

34
డైరెక్ట్ లింక్ ఉందా లేక అసలు రీజన్ వేరా?

ఈ రిపోర్ట్‌పై మెడికల్ ఎక్స్‌పర్ట్స్ కీలక కామెంట్స్ చేశారు. వాయు కాలుష్యానికి, మానసిక ఒత్తిడికి మధ్య కనెక్షన్ ఉన్న మాట వాస్తవమే అయినా.. కాలుష్యమే నేరుగా సూసైడ్‌కు మెయిన్ రీజన్ అని చెప్పలేమంటున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ బర్గెస్ ప్రకారం.. ఇక్కడ కేవలం ఒక 'అసోసియేషన్' మాత్రమే కనిపిస్తోంది గానీ ప్రత్యక్ష కారణం అని ప్రూవ్ అవ్వలేదు. పొల్యూషన్ ఎక్కువగా ఉండే అర్బన్ ఏరియాల్లో ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, లైఫ్‌స్టయిల్ ప్రాబ్లెమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అవన్నీ కలిసి మానసిక ఆరోగ్యంపై ఇంపాక్ట్ చూపుతుండవచ్చు.

44
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డెడ్లీ ఫ్యాక్ట్స్ ప్రకారం.. వరల్డ్ వైడ్‌గా ప్రతి సంవత్సరం 7,20,000 మందికి పైగా ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్నవారు, యంగ్ జనరేషన్‌లో చావులకు మూడో అతిపెద్ద కారణం ఈ సూసైడ్స్ కావడం విచారకరం.

గాలి శుద్ధి మాత్రమే సరిపోదు

ఈ రీసెర్చ్ అందించిన డేటాను బట్టి ప్రభుత్వాలు కొత్త రూల్స్ తీసుకురావాలని సైంటిస్టులు కోరుతున్నారు. సూసైడ్ ప్రివెన్షన్ ప్లాన్స్‌లో కేవలం కౌన్సెలింగ్ మాత్రమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే స్ట్రాటజీలను కూడా ఇంక్లూడ్ చేయాలి. అయితే, ప్యూర్ ఎయిర్ ఒక్కటే ఆత్మహత్యలను ఆపేస్తుందని అనుకోవడం పొరపాటని, మెంటల్ హెల్త్ పాలిసీలతో ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌ను కూడా మిక్స్ చేసి పనిచేస్తేనే అనుకున్న రిజల్ట్స్ వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories