Agniveer: అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. సర్వీస్ కాలాన్ని పెంచుతూ నిర్ణ‌యం

Published : Nov 04, 2026, 05:57 PM IST

Agniveer: సాయుధ దళాల్లో యువతకు అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకంలో కీలక మార్పు చేసింది. సర్వీస్ కాలాన్ని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

PREV
14
అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అగ్నివీర్‌ల సర్వీస్ కాలాన్ని పొడిగించే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎన్. రాజా సుబ్రమణి వెల్లడించారు. ఇప్పటివరకు నాలుగేళ్ల పాటు మాత్రమే సైన్యంలో పనిచేసే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో మరో రెండేళ్లు అదనంగా సేవలు కొనసాగించవచ్చు. ఈ వెసులుబాటు వల్ల అగ్నివీర్‌లకు సైన్యంలో మరింత అనుభవం సంపాదించడంతో పాటు శాశ్వత ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అదనపు అవకాశం లభిస్తుంది. సాయుధ దళాల్లో తమ సేవలను కొనసాగించాలనుకునే వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.

24
శాశ్వత ఉద్యోగాల ఎంపికలో అదనపు అవకాశం

అగ్నిపథ్ విధానం ప్రకారం నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీర్‌లలో గరిష్ఠంగా 25 శాతం మందిని మాత్రమే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల్లో శాశ్వత సిబ్బందిగా ఎంపిక చేస్తున్నారు. మిగిలిన 75 శాతం మంది సేవల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అయితే తాజాగా పదవీకాలం రెండేళ్లు పెంచడంతో శాశ్వత కేడర్‌లో స్థానం సంపాదించాలనుకునే వారికి మరింత సమయం అందుబాటులోకి వస్తుంది. అదనపు కాలంలో అగ్నివీర్‌ల పనితీరు, సామర్థ్యం, క్రమశిక్షణతో పాటు సాయుధ దళాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. మరోవైపు సైన్యంలో శాశ్వత నియామకం పొందని వారికి పౌర రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్య ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక ప్రయోజనాలు అందించే విధానం కొనసాగుతుంది.

34
తొలి బ్యాచ్ పదవీకాలం ముగియనున్న వేళ నిర్ణయం

2022లో అగ్నిపథ్ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నియమితులైన అగ్నివీర్‌ల సర్వీస్ గడువు ముగింపు దశకు చేరుకుంది. తొలి బ్యాచ్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో కలిపి సుమారు 24,400 మంది చేరారు. వీరిలో నౌకాదళానికి చెందిన అగ్నివీర్‌ల నాలుగేళ్ల గడువు నవంబర్ 21తో, వైమానిక దళ సిబ్బంది పదవీకాలం డిసెంబర్ 21తో, ఆర్మీ అగ్నివీర్‌ల సేవలు డిసెంబర్ 31తో ముగియనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 18 వేల మంది అగ్నివీర్‌లు సేవల నుంచి బయటకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వారికి అదనపు అవకాశాలను కల్పించనుంది.

44
శిక్షణలో నైపుణ్యాలు, నైతిక విలువలకు ప్రాధాన్యం

అగ్నిపథ్ పథకం ద్వారా ఇప్పటివరకు మూడు విభాగాల్లో భారీ సంఖ్యలో యువత సాయుధ దళాల్లో చేరారు. గత నాలుగేళ్లలో సుమారు 2.70 లక్షల మంది ఆర్మీలో, 27 వేల మంది వైమానిక దళంలో, 21 వేల మంది నౌకాదళంలో అగ్నివీర్‌లుగా నియమితులయ్యారు. సైనిక శిక్షణలో కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా నైతిక విలువలు, వృత్తిపరమైన నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీడీఎస్ జనరల్ రాజా సుబ్రమణి తెలిపారు. అగ్నివీర్‌లకు సేవా కాలం పెరగడం వల్ల ఈ శిక్షణతో పాటు క్షేత్రస్థాయి అనుభవాన్ని మరింతగా పొందే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories