8వ వేతన సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.18,000 నుంచి రూ.54,000కు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బకాయిల లెక్కలపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు కనీవిని ఎరగని రీతిలో పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం మోదీ సర్కార్ 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే… ఇది ఉద్యోగుల జీతాల పెంపుపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వేతన సంఘం సిపారసులపై ఢిల్లీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
27
దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యోగుల జీతాల పెంపు..
గతంలో వేతన సంఘాల జీతాలు పెంచిన విధానం, ప్రస్తుతం ఉద్యోగ సంఘాల డిమాండ్ల ప్రకారం.. కొత్త పే స్కేల్ ఎలా ఉంటుందో ఉద్యోగులు ఓ అంచనాకు వస్తున్నారు. వీరిప్రకారం శాలరీలు భాగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కనీస వేతనం (Basic Pay) రూ.18,000 ఉన్నవారికి 8వ వేతనంసంఘం అమలు తర్వాత ఏకంగా రూ.54,000 శాలరీ వస్తుందట. ఇదే జరిగితే దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వంగా ఎన్డిఏ నిలుస్తుంది.
.
37
రూ.18 వేల శాలరీ రూ.54 వేలు ఎలా అవుతుంది..?
ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000గా ఉంది. ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ (FNPO) సహా పలు ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.0 నుంచి 3.25 మధ్య ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదిస్తే, ప్రస్తుత బేసిక్ జీతాన్ని 3తో గుణిస్తారు. దీని ఫలితంగా కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.54,000కు పెరుగుతుంది.
జీతాల నిర్ధారణకు 'ఎక్రాయిడ్ ఫార్ములా' (Aykroyd Formula)ను ప్రాతిపదికగా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెరిగిన వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం కుటుంబాన్ని 3 యూనిట్లుగా లెక్కిస్తుండగా, వృద్ధ తల్లిదండ్రులను కూడా చేర్చి 5 యూనిట్లుగా పరిగణించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5 మంది సభ్యుల కుటుంబ ఖర్చులను లెక్కిస్తే, కనీస వేతనం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
57
ఈ ఉద్యోగులకు ఏకంగా రూ.15 లక్షల బకాయిలు..
8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, కమిషన్ తన తుది సిఫార్సులను సమర్పించి, ప్రభుత్వం ఆమోదించడానికి మరో 14 నుంచి 18 నెలలు పట్టొచ్చు. ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు భారీ మొత్తంలో బకాయిలు (Arrears) అందుకుంటారు.
లెక్కల ప్రకారం, లెవెల్-1 ఉద్యోగులు సుమారు రూ.3.6 లక్షల నుంచి రూ.5.65 లక్షల వరకు బకాయిలు పొందవచ్చు. ఉన్నత స్థాయి అధికారుల విషయంలో ఈ మొత్తం రూ.15 లక్షలు కూడా దాటిపోయే అవకాశం ఉంది.
67
ఉద్యోగుల డిమాండ్స్ ఇవే
జీతం పెంపుతో పాటు ఉద్యోగులు మరికొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఇందులో వార్షిక ఇంక్రిమెంట్‌ను 3% నుంచి 5% లేదా 7%కి పెంచడం, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడం, కరవు భత్యాన్ని (DA) మూల వేతనంలో విలీనం చేయడం వంటివి ముఖ్యమైనవి.
77
రంగంలో 8వ వేతన సంఘం
ప్రస్తుతం జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం తన పనిని ప్రారంభించింది. వివిధ భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం చివరికి ఎంత శాతం వేతనాన్ని పెంచుతుందోనని దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.