Kumbh Mela Monalisa: ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఇంట్లోవాళ్లూ పట్టించుకోలేదు

Published : Mar 25, 2026, 12:46 PM IST

Kumbh Mela Monalisa: కుంభమేళాత  వైరల్ అయిన మోనాలిసా ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ డైరెక్టర్ పై భారీ ఆరోపణలు చేసింది.  తనకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 

PREV
13
మళ్లీ వార్తల్లో మోనాలిసా

కుంభమేళాలో ఫోటోలతో వైరల్ అయిన మోనాలిసా భోస్లే కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మతాంతర వివాహం చేసుకున్న ఈ జంట తమకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.  కుంభమేళాలో వైరల్ అయ్యాక  డైరెక్టర్ సనోజ్ మిశ్రా 'మణిపూర్ ఫైల్స్' సినిమాలో ఆమెకు  అవకాశం ఇస్తానని పిలిపించారు. అయితే ఈ డైరెక్టర్‌పై అప్పటికే చాలా ఆరోపణులు ఉన్నాయి.

23
డైరెక్టర్ పై ఆరోపణలు

మోనాలిసా  'ది డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంలో నటిస్తున్నట్టు పోస్టర్లు కూడా విడుదలయ్యాయి.  డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి బాలీవుడ్‌లో నటించమని అడిగారు. దీనికి మోనాలిసా కూడా అప్పట్లో ఒప్పుకుంది. 'మోనాలిసా కళ్లు చాలా అందంగా ఉన్నాయి, ఆమె ఒక న్యాచురల్ బ్యూటీ. కానీ నటన రాదు, శిక్షణ ఇవ్వాలి' అని అప్పుడు సనోజ్ అన్నారు. ఇప్పుడు మోనాలిసా అదే డైరెక్టర్ సనోజ్ మిశ్రా గురించి మాట్లాడుతూ.. 'ఆయన చిన్న పిల్లలను కూడా వదలడు. వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. నాతో కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ తాకాడు. నేను సినిమా చేయనని చెప్పడంతో నన్ను మరింత వేధిస్తున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది.

33
ఇంట్లో వాళ్లు పట్టించుకోలేదు.

'సినిమా పేరుతో అతను నాతో చెడుగా ప్రవర్తిస్తున్నాడని మా ఇంట్లో వాళ్లకి కూడా చెప్పాను.  వాళ్లు కూడా పట్టించుకోలేదు.  సినిమా రంగంలో ఇవన్నీ మామూలే, ఏమీ కాదు అన్నారు. సినిమా కోసం నేను బలాత్కారానికి గురికాలేను కదా?' అంటూ మోనాలిసా ప్రెస్ మీట్ లో ప్రశ్నించింది. నిజానికి,సనోజ్ మిశ్రాపై గతంలో కూడా  అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ అప్పట్లో మోనాలిసా సనోజ్‌ను వెనకేసుకొచ్చింది. 'సనోజ్ సార్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు చెడు జరుగుతోంది. హోటల్‌లో ఆయనతో ఉన్నప్పుడు నాతో ఆయన ఎలాంటి తప్పు చేయలేదు' అని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories