LPG Booking: దేశంలో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌కు కొత్త టైమ్ లిమిట్ పెట్టారని చెప్పడంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది.
కొన్ని వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు కొత్త గడువులు అమల్లోకి వచ్చాయని ప్రచారం జరిగింది. పీఎంయూవై (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, డబుల్ సిలిండర్ కనెక్షన్లకు 35 రోజులు గడువు పెట్టారని సమాచారం వచ్చింది. అయితే ఈ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులు ఎక్కడా అమలు చేయలేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
25
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్పీజీ రీఫిల్ నిబంధనలు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌కు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు కనీసం 25 రోజుల గడువు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా కొనసాగుతుంది. ఈ నిబంధనలు కనెక్షన్ టైప్‌తో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
35
దేశంలో ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయా?
ఎల్పీజీ సరఫరా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. రిఫైనరీల్లో ప్రస్తుతం ఉత్పత్తి పెంచినట్లు అధికారులు వెల్లడించారు. అందువల్ల ఎల్పీజీ కొరత ఏర్పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఇటీవల నెలకొన్న యుద్ధ పరిణామాలపై జరిగిన మంత్రిత్వ శాఖ సమావేశంలో కూడా అధికారులు దేశంలో ఇంధన నిల్వలపై వివరాలు వెల్లడించారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ మాట్లాడుతూ దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. క్రూడ్ ఆయిల్ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఆమె వివరించారు.
55
బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశంలోని సుమారు 32 రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు పని చేస్తున్నాయి. అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తున్నట్లు సమాచారం వచ్చిన చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బృందాలు కూడా సక్రియంగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 1500 సడెన్ ఇన్స్పెక్షన్లు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.