కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తే ఉద్యోగులు భారీగా లబ్ది పొందనున్నారు. అయితే ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడం లేదు. మోడీ ప్రభుత్వం 2026 నుండి కొత్త 8వ వేతన సంఘం అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఏప్రిల్ నుండే కొత్త నియమాలు అమలులోకి వస్తాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.
గతంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ సభ్యుల సంఘం కొన్ని సిఫార్సులతో నివేదిక సమర్పించింది.
24
కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ఊహాగానాలు
వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల ఉంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి అనుగుణంగానే ఎనిమిదవ వేతన సంఘంపై జాతీయ కౌన్సిల్ సమావేశం అయింది.
34
గ్రేడ్ పే లెవెల్స్ సర్దుబాటు డిమాండ్
మరోవైపు గ్రేడ్ పే లెవెల్స్ ను సర్దుబాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. లెవెల్ 1, 3, 5 లను కలిపి వేతనాలు పెంచాలని ప్రతిపాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు మార్చి లేదా ఏప్రిల్ లో ఉండవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు.
44
పే లెవెల్స్ కలపడం వల్ల వేతనాలు పెరుగుతాయి
పే లెవెల్స్ కలపడం వల్ల వేతనాలు భారీగా పెరుగుతాయి. దాంతోపాటు 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో వేతనాలు పెంచాలని డిమాండ్ వస్తోంది. కానీ 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆశలు నెరవేరకపోవచ్చు. వేతన సవరణలో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' కీలకం అవుతుంది. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57.