Kumbh Mela 2025 : మరీ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామా.! ఈ ఫిబ్రవరి 12 అంతస్పెషల్ ఎందుకో?

Published : Feb 11, 2025, 09:06 PM ISTUpdated : Feb 11, 2025, 09:22 PM IST

Kumbh Mela Traffic Jam : కుంభమేళాలో అమృత స్నానాలన్ని ముగిసాయి. సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి రోజుల్లో అమృత స్నానాల సమయంలో లేనంత రద్దీ ఇప్పుడు నెలకొంది. ఏకంగా 300 కి.మీ ట్రాఫిక్ జామ్ జరిగింది. ఫిబ్రవరి 12న అంత స్పెషల్ ఏమిటో? 

PREV
13
Kumbh Mela 2025 : మరీ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామా.! ఈ ఫిబ్రవరి 12 అంతస్పెషల్ ఎందుకో?
Kumbh Mela traffic Jam

Kumbh Mela 2025 : ప్రపంచంలోనే  అతిపెద్ద ఆద్యాత్మిక కార్యక్రమం భారతదేశంలో జరుగుతోంది. 144 ఏళ్లకు ఓసారి ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది... కాబట్టి యావత్ దేశం ఈ మహాకార్యంలో పాల్గొనడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఇందులో పాల్గొని పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. విదేశీయులు సైతం ఈ మహా కుంభమేళాను చూసేందుకు తరలివస్తుంటారు. 

ఇలా గత నెల రోజులుగా ప్రయాగరాజ్ లో గంగానది తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. జనవరి 13, 2025న ప్రారంభమైన ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 40 కోట్లమమందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా పది పదిహేను రోజుల సమయం వుంది...  ఇంతలో మరో 5 నుండి 10 కోట్ల మంది వస్తారని అంచనా.మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి 50 కోట్లమంది ప్రయాగరాజ్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. 

మహా కుంభమేళాలో ఇప్పటికే మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి అమృత స్నానాలు ముగిసాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 12న అంటే రేపు బుధవారం మాఘ పౌర్ణమి రోజున సంగమ స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశ నలుమూలల నుండి తండోపతండోలుగా భక్తులు తరలివస్తున్నారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే రోడ్లన్ని వాహనాలతో నిండిపోయి రద్దీగా మారాయి. స్వయంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రయాగరాజ్ కు వెళ్లేవారు రెండురోజులు ఆగాలని సూచిస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 
 

23
Maha Kumbh Mela Traffic

ఏకంగా 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ : 

మరికొద్దిరోజుల్లో ప్రయాగరాజ్ కుంభమేళా ముగుస్తుంది... ఇక జీవితంలో ఈ అవకాశం మళ్లీ రాదు. 144 తర్వాతగానీ మళ్లీ ఈ మహా కుంభమేళా జరగదు... అప్పటివరకు ఈ జనరేషన్ వుండదు. అందువల్లే ఈ అరుదైన అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలని దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసమే కుంభమేళాకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది.  

రేపు(బుధవారం) మాఘ పౌర్ణమి మంచిరోజు కావడంతో ప్రయాగరాజ్ కు భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. గత ఆదివారం నుండి భక్తుల రద్దీ పెరిగింది... ఇక ప్రస్తుతం భక్తుల వాహనాలతో రోడ్లు నిండిపోయాయి. ప్రయాగరాజ్ కు వెళ్లే దారులన్ని వాహనాలతో కిక్కిరిసిపోయాయి... ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇలా దాదాపు 300 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. 

ఇలా ప్రయాగరాజ్ లో భక్తుల రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినవారు ముందుకు సాగలేక, వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. వాహనాల్లోని గంటల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత రెండురోజులుగా ఇదే పరిస్థితి వుంది... పోలీసులు, ఇతర అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. 

ఇంతభారీ ట్రాఫిక్ జామ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటిసారి అని అంటున్నారు. 300 కిలోమీటర్లు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం మామూలువిషయం కాదు... ఎటుచూసినా కనుచూపుమెర వాహనాలే కనిపిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆద్యాత్మిక కార్యక్రమంలో అతిపెద్ద ట్రాఫిక్ కూడా రికార్డు సృష్టిస్తోంది. 
 

33
Kumbh Mela 2025

కుంభమేళాలో ఆంక్షలు : 

భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు కుంభమేళాలో ఇప్పటికే భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మౌని అమావాస్య తొక్కిసలాట తర్వాత అలాంటి ఘటనలు జరక్కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.  ఇప్పుడు మళ్ళీ రద్దీ పెరగడంతో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు సంగమస్నానానికి వెళ్లే సమయంలో సంయమనం పాటిస్తూ పోలీసులు, భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచిస్తున్నారు. 

ఇవాళ్టి(మంగళవారం) నుండి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్ గా ప్రకటించారు.  సాయంత్రం నుండి ప్రయాగరాజ్ ను కూడా నో వెహికిల్ జోన్ గా ప్రకటించారు. అంటే నగరంలోకి కూడా బయటినుండి వాహనాలను అనుమతించరన్నమాట. అంటే ప్రస్తుతం ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నవారు కుంభమేళాకు చేరుకోవడం అసాధ్యమే. మాఘ పౌర్ణమి రోజునే సంగమస్నానం చేయాలనుకునేవారు తమ వాహనాన్ని దిగి కాలినడకన కుంభమేళా ప్రాంతానికి చేరుకోవాల్సి వుంటుంది... ఇదికూడా 50 కి.మీ లోపువారికే సాధ్యం. 

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంగమస్నానం తర్వాత భక్తులు సులువుగా బయటకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. 

బుధవారం విఐపిలు కుంభమేళాకు రాకూడదని అధికారులు సూచించారు. అలాగే సామాన్య భక్తులు కూడా మరో రెండుమూడు రోజులు ప్రయాగరాజ్ కు ప్రయాణం పెట్టుకోకూడదని సూచించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో రైల్వే స్టేషన్లను కూడా మూసివేసారని ప్రచారం జరుగుతోంది..కానీ అలాంటిదేమీ లేదని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. 

మొత్తంగా కుంభమేళాకు వెళ్లే దారులన్ని వాహనాలతో నిండిపోయాయి.  గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు వెంటనే ట్రాఫిక్ ను క్లియర్ చేసి కుంభమేళా పవిత్ర స్నానానికి అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సుదూర ప్రాంతాలనుండి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానంకోసం వచ్చినవారు ఈ ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

click me!

Recommended Stories