ఎనిమిదో వేతన సవరణ అమలుతో త్వరలోనే వేతనాలు భారీగా పెరుగుతాయని ఆశించిన ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లుతున్నట్టే కనిపిస్తోంది. ఈ సవరణ అమలుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైనప్పటికీ, 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోవచ్చు.
కేంద్ర ఉద్యోగులకు చెడు వార్త. 2026లో జీతాలు, పెన్షన్లు పెరగకపోవచ్చు. వేతన సంఘం నివేదిక సమర్పణ, ఆమోదం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు.
24
8వ వేతన సంఘం ఏర్పాటు
గత నెలలో మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది.. వాళ్లు చేసిన సూచనలను అమలు చేస్తే ఉద్యోగుల ఆదాయం భారీగా పెరుగుతుంది.
34
జీతం, పెన్షన్ పెరుగుదల అంచనా
సవరణ అమలులోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా లబ్ది పొందుతారు. ప్రాథమిక జీతం 51,500, కనీస పెన్షన్ 25,000 ఉండవచ్చు. 8వ వేతన సంఘం అమలైతే, ప్రాథమిక జీతం 186% పెరుగుతుంది.
44
2026 లో జీతాలు పెరగకపోవచ్చు
సంఘం నివేదిక సమర్పించాక, జీతాల పెంపు ప్రక్రియ మొదలవుతుంది. అయితే బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన లేకపోవడం, ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయకపోవడంతో 2026 లో జీతాలు పెరగకపోవచ్చనే వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో 8వ వేతన సంఘం అమలుకు ఇంకా చాలా సమయం పడుతుందని అంతా భావిస్తున్నారు.