8th Pay Commission : ఉద్యోగులకు ఇక పండగే ... లక్షలకు లక్షల జీతాలు

Published : Feb 04, 2025, 09:34 PM ISTUpdated : Feb 04, 2025, 09:59 PM IST

8వ వేతన సంఘం : ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. వచ్చేఏడాది నుండి 8వ వేతన సంఘం సిపార్సులు అమలవుతాయి. తద్వారా ఉద్యోగులు జీతాలు ఏ స్థాయిలో పెరగనున్నాయో తెలుసా?   

PREV
15
8th Pay Commission : ఉద్యోగులకు ఇక పండగే ...  లక్షలకు లక్షల జీతాలు
8th pay Commission

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఏడాదినుండి భారీ జీతాలు అందుకోనున్నారు. మోదీ సర్కార్ వారు ఎగిరిగంతేసే స్థాయిలో జీతభత్యాలు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం గడువు 2025తో ముగియనుంది... 2026 నుండి 8వ వేతన సంఘం సిపార్సులు అమలవుతాయి. కాబట్టి  వచ్చేఏడాది భారీగా జీతభత్యాలు పెరుగుతాయని ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలను అడియాశలు చేయకుండా కేంద్రం కూడా భారీగానే జీతాలు పెంచనుందని తెలుస్తోంది. 

 

 

25
8th pay Commission

ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు నరేంద్ర మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏర్పాటుచేసే ఈ వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర అలవెన్సులపై స్టడీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. 

35
8th pay Commission

8వ వేతన సంఘం సిపార్సుల అమలుతో కేంద్ర ప్రభుత్వ లెవెల్ 10 గ్రూప్ A అధికారుల జీతాలు రూ.1,60,446 కు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 

45
8th pay Commission

లెవెల్ 9 అధికారులు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటివారి జీతాలు రూ. 1,51,866 కు పెరగవచ్చని తెలుస్తోంది. ఇక లెవెల్ 8 అధికారుల జీతాలు రూ. 1,36,136 కు పెరగవచ్చని భావిస్తున్నారు.  

55
8th pay Commission

ఇక ప్రస్తుతం రూ. 18,000 బేసిక్ సాలరీ 8వ వేతన సంఘం అమలుతో రూ. 51,480 కు సవరించబడుతుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.

click me!

Recommended Stories