ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత హాలీవుడ్ చిత్రాలు పరిచయం ఉన్న అందరికీ వచ్చిన ఒకే ఒక ఆలోచన 'ప్రెడేటర్'లా ఉందని. అయితే హీరో ఆర్య ..అబ్బే ఇది ఆ కథ కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది అన్నారు. నిజంగానే ఈ సినిమా కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తుందా...అసలు ఈ సినిమా కథేంటి...వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ యేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..
కథాంశం
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టీమ్ రన్ ప్రత్యేకమైన ప్రాజెక్టులు చేపడుతూంటుంది. తన దగ్గర ఉన్న సూపర్ ట్రైనింగ్ బ్యాచ్ తో ఎలాంటి శత్రు సంభంద సమస్యలు అయినా పరిష్కరించగలగుతారు. దూకుడుగా ముందుకు వెళ్లగలుగుతాడు. ఈ సారి అతను ఓ డేంజరస్ ఆపరేషన్ చేపడతాడు. చాలా సంవత్సరాలగా పౌర కార్యకలాపాలు లేదా సైనిక కార్యకలాపాలు లేని భారతదేశంలోని ఈశాన్య అటవీ ప్రాంతం వెనక ఉన్న సీక్రెట్ ని ఛేధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అక్కడకి వెళ్లినవారు తిరిగిరావటం లేదు. దాంతో ఆ మిస్టరీని తెలుసుకోవడానికి కెప్టెన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందాన్ని అక్కడికి చేరుకోవడానికి సిద్ధం చేస్తుంది. అది చాలా దుర్బేద్యమైన ప్రాంతం. ప్రతీ సారి తన సాహసాలతో సమయస్పూర్తితో చాలా ఈజీగా డీల్ చేసే విజయ్ కుమార్ కు అక్కడ పరిస్దితులు ఓ పట్టాన లొంగవు. అక్కడ ఉన్నది మానవులు కాదని వింత జీవులు అని తెలుసుకున్న అతను వాటిని ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎలా ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో అతను సక్సెస్ అయ్యాడా... అసలు ఈ వింత జీవులు ఎవరు...వారి వెనక ఉన్నవారు ఎవరు...ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?
రొటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ లు, అదిరిపోయే ట్విస్ట్ లు, ఒళ్లుగగుర్పొడిచే సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూడాలంటే కేవలం హాలీవుడ్ సినిమాలు తప్ప మనకు వేరే దారిలేదా అని ఫీలయ్యే పరిస్దితి మెల్లిగా మారుతోంది. అయితే, క్రమంగా మన వాళ్లూ కొత్త కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తున్న సినిమాలు ఈ మధ్య మన ముందు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు ఫిల్మ్ మేకర్లు కూడా… అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. అయితే ఈ సినిమాలో కాన్సెప్టు కు తగ్గ కథ,కథనం లేకపోవటం నిరాశపరుస్తుంది.అలాగే సినిమా వంద శాతం 'ప్రెడేటర్' నుంచి తీసుకున్న ఆలోచనే.
ఈ సినిమాలో ఏమన్నా చెప్పుకోవాలి అంటే వీఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి మాట్లాడాలి. మొదటే చెప్పుకున్నట్లు ఇటువంటి సినిమాలు హాలీవుడ్‌లో వచ్చాయి. అవన్నీ దాదాపు ఇక్కడా డబ్బింగ్ అవుతూ వచ్చాయి. కాబట్టి మనవాళ్లకీ ఇలాంటి సినిమాలు పరిచయమే.అయితే అదే సమయంలో మన వీఎఫ్ఎక్స్ వర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తూంటారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని నిర్మాతలు చెప్తూంటారు. కాబట్టి ఆ విషయంలో మాగ్జిమం చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తూంటారు.
கேப்டன்
దానికి తోడు ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అంతగొప్పగా కుదరలేదనే చెప్పాలి. VFX విషయానికి వస్తే ఆడియన్స్ చాలా మెచ్యూర్ గా ఉన్నారు. తొంభైల నాటి VFXలుగా పూర్ గా ఉంటే మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. VFX కు చెందిన ప్రతీ షాట్ బాగా దారుణంగా , కథకు కీలకమైన క్రీచర్ ని సరిగ్గా చూపలేక, వాటితో వచ్చై ఫైట్స్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేక చతికిలపడ్డాయి.
దానికి తోడు డైరక్టర్ తన దృష్టిని కథ మీద కాకుండా కేవలం మిగతా విషయాలమీద పెట్టినట్లున్నారు. ఎందుకంటే సృష్టిలో లేని క్రీచర్ ని క్రియేట్ చేయాలి. దానికి కష్టపడ్డారు. ఏ మేరకు సక్సెస్ అయ్యారనేది ప్రక్కన పెడితే. దాంతో సినిమాలో మినిమం ఉండాల్సిన స్టోరీ లైన్..అందుకు తగ్గ విస్తరణ, స్క్రీన్ ప్లే ఏదీ జరగలేదు. రొటీన్ సీన్స్ ఎక్కువ శాతం ఆక్రమించాయి. జోరో ఎక్సైట్మెంట్. సైన్స్ ఫిక్షన్ కదా ఎవరు పట్టించుకుంటారు అనుకున్నారో ఏమో కానీ లాజిక్స్ వదిలేసారు. డిఫరెంట్ ఎటెమ్టే ...కానీ వర్కవుట్ కాలేదు.
టెక్నికల్ గా...
తమిళంలో విజయవంతంమైన “టెడ్డి” తీసిన దర్శకుడే దానికి ముందు “టిక్ టిక్ టిక్” అనే సినిమా తీశారు. ఆ రెండింటిలోనూ వర్కవుట్ అయిన అంశాలే ఇక్కడ మిస్సయ్యాయి. దర్శకుడు శక్తి సుందర్ రాజన్ సిననిమాలు కథ, స్క్రీన్ ప్లే విషయంలో తడబడుతున్నాయి. ఈ సారి అది మరికాస్త ఎక్కువైంది. అతనివి విభిన్నమైన మంచి కాన్సప్టులే. కానీ స్టోరీ నేరేషన్ వైజ్ గా చూస్తే నిరాశపరుస్తున్నాయు. టిక్ టాక్ చిత్రం విఫ్ఎక్స్ తో వర్కవుట్ అయ్యింది. కానీ కెప్టెన్ ఆ విషయం పూర్తిగా నిరాశపరిచింది. ఆడియో పరంగా విజువల్స్ పరంగా ఈ చిత్రం ఊహించని మేరకు గొప్ప ఎక్స్ పీరియెన్స్ ఇవ్వలేకపోయింది. ఇమామ్ మ్యూజిక్ బాగుంది. కెమెరా వర్క్ కూడా నీట్ గా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇలాంటి కథలకు తగ్గట్లు లేవు.
నటీనటుల్లో ...ఆర్య కష్టం బాగా కనపడుతుంది. సినిమాల్లో చూపించిన జీవి ఆర్టిస్ట్ ల ముందు ఉండదు. కానీ, చాలా దూరం నుంచి లేని ఆ జంతువును ఊహించుకొని చెయ్యాల్సి ఉంటుంది. చాలా సీన్స్ లో ఆర్య ఫిజికల్ గా కూడా చాలా సీన్స్ లో కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ కష్టానికి స్క్రిప్టు కూడా సహకరించి ఉంటే బాగుండేది. ఐశ్వర్య రోల్ ఓకే. ఆర్యతో కెమిస్ట్రీ బాగుంది. తక్కువ సీన్స్ లో కనిపించినా సిమ్రాన్ మన ఎటెన్షన్ గ్రాబ్ చేస్తుంది.
Arya Captain
పాజిటివ్ లు :
కొన్ని సీన్స్ లో ఆర్య ఫెరఫార్మన్స్ #Arya performance in parts
మ్యూజిక్ & BGM
సినిమాటోగ్రఫీ
కొత్త కాన్సెప్ట్
నెగిటివ్ లు :
స్టోరీ & స్క్రీన్ ప్లే
వీఎఫ్ఎక్స్
దర్శకత్వం
Arya Captain
ఫైనల్ థాట్...
హాలీవుడ్ బి గ్రేడ్ సినిమా డబ్బింగ్ సినిమాలా అనిపించే ఈ సినిమాని.. అక్కడా డబ్ చేసి రిలీజ్ చేయచ్చు
Rating: 2
నిర్మాణ సంస్థ:థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ పతాకం
నటీనటులు:ఆర్య ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు
సౌండ్ డిజైన్ : అరుణ్ శీను,
సౌండ్ మిక్స్ : తపస్య నాయక్,
కలరిస్ట్ : శివ శంకర్ .వి,
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్,
కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్,
స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్,
ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి,
ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్,
సినిమాటోగ్రఫీ : ఎస్. యువ,
మ్యూజిక్ : డి ఇమాన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్,
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్,
Runtime:116 నిమిషాల
రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.
విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2022