నారా లోకేష్ ఎఫెక్ట్: గంటాకు చంద్రబాబు ఝలక్

First Published Mar 11, 2019, 12:01 PM IST

విశాఖ జిల్లాలోని అనకాపల్లి స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన ఆడారి ఆనంద్‌కు కేటాయించింది టీడీపీ. ఇక విశాఖ ఎంపీ స్థానం నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపాలని  ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

విశాఖ జిల్లాలోని అనకాపల్లి స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన ఆడారి ఆనంద్‌కు కేటాయించింది టీడీపీ. ఇక విశాఖ ఎంపీ స్థానం నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావును ఈ స్థానం నుండి పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం.
undefined
విశాఖ జిల్లాలోని భీమిలీ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి గంటా శ్రీనివాసరావు రంగం సిద్దం చేసుకొన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఆయన పీఆర్పీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనంతో ఆయన కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు టీడీపీ తీర్థం పుచ్చుకొన్న విషయం తెలిసిందే.
undefined
బీమిలి నుండి పోటీకి గంటా శ్రీనివాసరావు పోటీకి సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు గంటాను కోరారు. అయితే ఈ విషయమై ఆలోచించి నిర్ణయం చెబుతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
undefined
విశాఖ జిల్లా నుండి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. భీమిలి లేదా విశాఖ నార్త్‌ నుండి లోకేష్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. బీమిలి నుండే పోటీకి గంటా ఆసక్తి చూపితే విశాఖ నార్త్ నుండి లోకేష్ పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా విశాఖ ఎంపీ స్థానం నుండి గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే కోణంలో కూడ బాబు యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనకాపల్లి సీటును బీసీకి కేటాయించారు.దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా పేరును టీడీపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు.
undefined
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేరును కూడ విశాఖ ఎంపీ సీటు కోసం పరిశీలించారు. అయితే పల్లా శ్రీనివాస్ కూడ బీసీ సామాజికవర్గానికి చెందినవాడు.దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కోసం టీడీపీ అన్వేషిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీతొ పొత్తు కారణంగా బీజేపీ అభ్యర్ధిగా కంభంపాటి హరిబాబు ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
undefined
click me!