దీని వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయా?

First Published Feb 7, 2023, 4:58 PM IST

మానసిక ఒత్తిడి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక ఈ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆడవారిలో పీరియడ్స్ మిస్ అవుతున్నాయట. అయితే నిజంగా పీరియడ్స్ మిస్ కావడానికి మానసిక ఒత్తిడే అసలు కారణమా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. 
 

ఈ రోజుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది. స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి తలనొప్పి, బాడీ పెయిన్స్ లేదా శరీరం బలహీనంగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏ బాహ్య సమస్య అయినా సరే అది శరీరాన్ని, మనస్సును సమానంగా ప్రభావితం చేస్తుంది. 

అందుకే మనసు సంతోషంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తారు. అయితే ఒత్తిడి మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆడవారు నెలసరిలో ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తారట. అంతేకాదు ఇది పీరియడ్స్ ను మిస్ కూడా చేస్తుందని చెప్తున్నారు. మరి అందులో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పీరియడ్స్ మిస్సింగ్ కు ప్రధాన కారణం హార్మోన్లు సక్రమంగా లేకపోవడం. అయితే ఒత్తిడి పిట్యూటరీ గ్రంథిలో ఉండే పునరుత్పత్తి హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది. ఇది మొత్తం రుతుచక్రాన్ని దెబ్బతీస్తుంది. 

periods

ఒత్తిడి రుతుచక్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది: ఒత్తిడి పీరియడ్స్ సమయంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. ఎలా అంటే.. 

పీరియడ్స్ మిస్ కావొచ్చు

ఆడవారు ఒత్తిడితో బాధపడితే వారికి పీరియడ్స్ సక్రమంగా కావు. అంటే దీనిలో పీరియడ్స్ మధ్యలోనే ఆగిపోవడమో లేకపోతే ఆలస్యంగా రావడమో.. లేదంటే ఆ నెల మొత్తమే కాకపోవడమో జరుగుతుంటాయి. 
 

periods pain

అధిక నొప్పి

ఒత్తిడి ఎక్కువగా ఉండే ఆడవారికి నెలసరి సమయంలో భరించలేని నొప్పి కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే సాధారణం కంటే ఇంకా ఎక్కువ నొప్పి ఉంటుంది. 

పదేపదే పీరియడ్స్ రావడం

ఈ ఒత్తిడి వల్ల పీరియడ్స్ టైం రాకముందే తొందరగా రావడం వంటి సమస్య కూడా ఎదురవుతుంది. దీనిలో ఒక్కోసారి ఆగిపోయిన పీరియడ్స్ కొన్ని రోజుల్లోనే మళ్లీ ప్రారంభమవ్వొచ్చు. 
 

అమెనోరియా 

ఒత్తిడితో ఉన్న ఆడవారికి అమెనోరియా అనే సమస్య కూడా ఉండొచ్చు. అమెనోరియాలో నెలసరి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. 
 

ఈ సమస్యకు అసలు కారణం

హార్మోన్ల అంతరాయం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిట్యూటరీ గ్రంథి అనేది మెదడులో ఉండే ముఖ్యమైన గ్రంథి. దీని నుంచే అన్ని హార్మోన్లు విడుదల అవుతాయి. ఒత్తిడి వల్ల పిట్యూటరీ గ్రంథిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.  దీనివల్ల హార్మోన్లు విచ్ఛిన్నమవుతాయి.

periods

ఒత్తిడి స్థాయి

మన ఒత్తిడి స్థాయి కూడా ఈ సమస్య ఎక్కువ లేదా తక్కువగా ఉండటానికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఒత్తిడి ఎక్కువగా ఉంటే కొంతకాలం పీరియడ్స్ సక్రమంగా ఉండవు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా పీరియడ్స్ మిస్ అవుతాయి లేదా ఆగిపోతాయి.

ప్రీమెన్స్ ట్రువల్ సిండ్రోమ్

ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన సిండ్రోమ్. దీనిలో ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు క్రమరహిత పీరియడ్స్ సమస్య ఉంటుంది. అలాగే పీరియడ్స్ రాకముందే వాంతులు, బలహీనత, అలసట, ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 


ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?

జీవనశైలిలో మార్పు చేసుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం..

ధ్యానం లేదా యోగా:  ధ్యానం, యోగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతకు కూడా సహాయపడతాయి.

నిద్ర:  ఈ సమస్య  ఉన్నవారు కంటినిండా  నిద్రపోయేలా చూసుకోవాలి. ఎందుకంటే అసంపూర్ణ నిద్ర శరీర జీవక్రియను పాడు చేస్తుంది. ఇది రుతుచక్రంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి సమయానికి నిద్రపోండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. 

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి

మీ శరీరంలో విటమిన్ డితో పాటుగా ఇతర పోషకాలు లోపిస్తే కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మంచి పోషకాహారాన్ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే ఆల్కహాల్, కెఫిన్ కు దూరండా ఉండండి.  మానుకోండి.

వైద్యుడిని సంప్రదించండి

జీవనశైలిలో మార్పులు చేసుకున్నప్పటికీ ఈ సమస్య అలాగే ఉంటే ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లండి. ఇలాంటి పరిస్థితిలో మీరు యాంటీ-యాంగ్జైటీ, యాంటీ డిప్రెషన్ మందులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

click me!