రోజ్ డే స్పెషల్ : గులాబీ రేకులతో మెరిసిపోయే ఫేస్ ప్యాక్..!

First Published Feb 7, 2023, 3:10 PM IST

గులాబీ పువ్వు... స్కిన్ విషయంలో చాలా మ్యాజిక్ చేస్తుంది. ప్రతిరోజూ మన స్కిన్ కేర్ రొటీన్ లో దీనిని భాగం చేసుకుంటే... అందంగా మెరిసిపోవచ్చని సూచిస్తున్నారు.
 

వాలంటైన్ వీక్ మొదలైంది. మొదటి రోజుని రోజ్ డే గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు..తాము ప్రేమించిన వారికి గులాబీ అందజేస్తారు. ఆ విధంగా తమ ప్రేమను తెలియజేస్తారు. ఈ రోజ్ డే రోజు అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఆ అందాన్ని కూడా... గులాబీ రేకులతో సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  గులాబి రేకులతో అందాన్ని పెంచుకోవడం ఎలాగో ఒకసారి చూద్దాం...
 

గులాబీ పువ్వు... స్కిన్ విషయంలో చాలా మ్యాజిక్ చేస్తుంది. ప్రతిరోజూ మన స్కిన్ కేర్ రొటీన్ లో దీనిని భాగం చేసుకుంటే... అందంగా మెరిసిపోవచ్చని సూచిస్తున్నారు.

గులాబీ రేకులతో ఏకంగా ఫేస్ ప్యాక్ కూడా తయారుచేసుకోవచ్చు. దాని తయారీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం....మీకు కనుక ఈ పువ్వంటే ఇష్టం ఉంటే.. దీనిని మీరు ఇంట్లో ప్రయత్నించవచ్చు.

ఈ ఫేస్ ప్యాక్ తయారీకి మీకు కావాల్సిందల్లా... తాజా గులాబి రేకులు, కెమికల్స్ లేకుండా తయారు చేసిన తేనె, రోజ్ వాటర్. ఈ మూడింటితో ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు.

తాజా గులాబీ రేకులను ముందుగా.... రోజ్ వాటర్ లో దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు నానెట్టాలి. ఆ తర్వాత... దానిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో... తేనె కలపాలి. ఇప్పుడు దీనిని ముఖం, మెడ మొత్తం పట్టించాలి.


15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత...పొడి టవల్ తో తుడుచుకోవాలి. ఆతర్వాత.. నూనెతో ముఖాన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె లేదంటే.. ఆలివ్ ఆయిల్  తో మీరు మసాజ్ చేసుకోవచ్చు. అంతే... అందంగా మెరిసిపోతారు.

click me!