Washing Clothes: ఎప్పుడు పడితే అప్పుడు… ఏ వారం పడితే ఆ వారం దుస్తులు ఉతికేస్తున్నారా? ఏమాత్రం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజుల్లో బట్టలు ఉతికితే ఇంట్లో కష్టాలు వస్తాయి. ఆర్థికంగా నష్టం రావచ్చు.
హిందూ ధర్మంలో మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బట్టలు ఉతకడానికి కూడా కొన్ని నిమయాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు దుస్తులు ఉతకడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారంలో అన్ని రోజులు దుస్తులు ఉతకొచ్చు కానీ ఒక రోజున మాత్రం ఉతకకూడదు. ఆ రోజు ఏ వారమో తెలుసుకోండి.
23
ఏ వారం ఉతకకూడదు?
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం గురువారంనాడు దుస్తులు ఉతకకూడదు. గురువారం బట్టలు ఉతికితే డబ్బు నష్టం వస్తుందని, ఇంట్లో సంతోషం తగ్గిపోతుందని అంటారు. గురువారానికి అధిపతి బృహస్పతి. మన జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును ఇచ్చేది గురు గ్రహమే. జాతకంలో గురు గ్రహం శాంతంగా ఉంటేనే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. ఇక దుస్తులు ఉతకడం అనేది శని గ్రహానికి సంబంధించిన పని. గురుడికి ఇష్టమైన గురువారం నాడు శనికి సంబంధించిన పని చేస్తే ఆర్థికపరంగా నష్టాలు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా గురువారం నాడు దుస్తులు ఉతకకూడదు.
33
రాత్రిపూట ఉతకొచ్చా?
ఉదయం పనులు ఎక్కువైపోతే చాలా మంది పడుకునే ముందు వాషింగ్ మెషీన్లు దుస్తులు ఉతికేందుకు వేసేస్తూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం ఏ మాత్రం మంచిది కాదు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, రాత్రిపూటే బట్టలు ఉతకడానికి టైమ్ కేటాయించుకుంటున్నారు. రాత్రిపూట నెగెటివ్ ఎనర్జీ సంచారం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బట్టలను బయట ఆరవేస్తే, ఆ శక్తులు దుస్తుల్లోకి చేరే అవకాశం ఉంది. ఆ బట్టలను మనం వేసుకున్నప్పుడు, ఆ నెగెటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సూర్యరశ్మికి నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తి ఉంది. అందుకే ఉదయం పూటే దుస్తులు ఉతికి ఆరేయడం మంచిది.