4.పైలెట్స్ ఇద్దరూ ఒకే రకమైన భోజనం ఇవ్వరు...
చాలా విమానయాన సంస్థల్లో పైలెట్స్ ఇద్దరికీ ఒకేలాంటి భోజనం అందించరు. ఎందుకంటే.. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరికి ఇబ్బంది ఏర్పడినా.. మరో పైలెట్ ఆరోగ్యంగా ఉండి విమానాన్ని సురక్షితంగా నడపాలి. అందుకే ఇద్దరికీ డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తారు.
5.పైలెట్స్ తమ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదా?
విమానంలో పైలెట్స్ తమ పర్సనల్ విషయాలను విమానంలో మాట్లాడకూడదని మీకు తెలుసా? అయితే.. 10వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పైలెట్లు విమానాల గురించి మాట్లాడాలి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత సంబంధిత విషయాలు లాంటివి మాత్రం మాట్లాడకూడదు.
6.విమానంలో మీ సీటు ఎప్పుడైనా మారొచ్చు..
విమానంలో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత.. అదే సీటు శాశ్వతం అని చాలా మంది అనుకుంటారు. కానీ, విమాన సిబ్బంది మీ సీటును ఎప్పుడైనా మార్చే అధికారం వారికి ఉంటుంది. మీ సీటు మార్చడానికి వారి దగ్గర చాలా కారణాలు ఉంటాయి.
7. కొన్ని రకాల దుస్తులు ధరిస్తే విమానం ఎక్కడానికి కూడా ఒప్పుకోరు...
కొన్ని విమానయాన సంస్థలు అభ్యంతరకరమైన సందేశాలు ఉన్న దుస్తులు, అసభ్యంగా భావించే దుస్తులు లేదా భద్రతకు ఆటంకం కలిగించే దుస్తులు ధరిస్తే.. విమానం ఎక్కనివ్వరు.