మీ బాస్ కి అస్సలు చెప్పకూడని విషయాలు ఇవి...!

Published : Jul 18, 2022, 01:23 PM IST

మనతో స్నేహంగా ఉంటారు.. చెప్పాల్సిన విధంగా చెప్పి..మనతో పని చేయించుకుంటారు. అయితే.. బాస్ స్ట్రిక్ట్ గా ఉన్నా.. స్నేహంగా ఉన్నా కూడా.. మనం వారితో కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదట. 

PREV
18
 మీ బాస్ కి అస్సలు చెప్పకూడని విషయాలు ఇవి...!

అందరు బాస్ లు ఒకేలా ఉండరు. కొందరు రూలర్ లా మనల్ని రూల్ చేస్తారు. మనకు ఆర్డర్స్ వేస్తూ... పనులు చేయించుకుంటారు. కానీ.. కొందరు బాస్ లు అలా కాదు.. మనతో స్నేహంగా ఉంటారు.. చెప్పాల్సిన విధంగా చెప్పి..మనతో పని చేయించుకుంటారు. అయితే.. బాస్ స్ట్రిక్ట్ గా ఉన్నా.. స్నేహంగా ఉన్నా కూడా.. మనం వారితో కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదట. బాస్ లతో ఓ ఉద్యోగి అస్సలు చెప్పకూడని విషయాలు ఏంటో ఓసారి చూద్దాం..

28

1.చాలా మంది ఉద్యోగులు.. తమ బాస్ తో ఇచ్చిన పనిని చేయడం ఇష్టంలేకపోతే.. వెంటనే నా వల్ల కాదు అని చెప్పేస్తుంటారు. ముఖ్యంగా బాస్  ఫ్రెండ్లీగా ఉంటే ఎక్కువగా చెప్పేస్తుంటారు. అయితే.. ఈ మాట అస్సలు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల మీకు పని పట్ల ఇంట్రెస్ట్ లేదని అనుకుంటారు. అంతేకాకుండా పని పట్ల కాన్ఫిడెన్స్ కూడా లేదని అనుకుంటారు. కాబట్టి.. ఈ మాట అస్సలు చెప్పకూడదు.
 

38

2.ఇక కొందరు ఉద్యోగులు బాస్ ఏదైనా పని చెబితే. ఆ పని నాదు కాదు అని చెప్పేస్తుంటారు. నా వర్క్ నేను చేస్తున్నాను.. నాది కాని వర్క్ నేను చేయను అని చెప్పేస్తూ ఉంటారు. అయితే.. ఇలా అస్సలు చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల మీరు మీ ఉద్యోగానికి మించి వెళ్లడానికి ఇష్టపడటం లేదని అర్థమట.

48

3.ఇక కొందరు ఉద్యోగులు.. తమ బాస్ చెప్పిన పనికి మాకు రాదు, మాకు తెలీదు లాంటి సమాధానలు చెబుతుంటారు. ఇలా కూడా చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల మీరు ఉద్యోగంలో అన్ని విషయాలు నేర్చుకోలేకపోతున్నారని అర్థమట.

58

4.ఇక కొందరు ఉద్యోగులు బాస్ ఏం చెప్పినా.. కానీ అంటూ సాగదీస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల వారు మిమ్మల్ని కేర్ లెస్ గా అనుకునే అవకాశం ఉంది.

68

5.ఇక కొందరు తాము పనిచేసిన పాత కంపెనీల గురించి చెబుతూ ఉంటారు. ఆ కంపెనీలో ఉన్నప్పుడు నేను అలా చేశాను.. ఇలా చేశాను అని గొప్పలు చెబుతుంటారు. నిజానికి మీరు అక్కడ ఏం చేశారు అనేది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేదే ముఖ్యం.

78

6.మీరు చేసిన తప్పును మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. తప్పు చేసి కూడా అది తమ తప్పు కాదు అని కొందరు చెబుతూ ఉంటారు. అలా చెప్పకూడదు.

88

7. ఇక కొందరు.. తమకు ఆఫీసులో చాలా బోర్ కొడుతుంది అంటూ చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల మీకు పని పట్ల ఉత్సాహం లేదని వారు భావిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories