Type 2 Diabetes: ఇలా చేస్తే టైప్ 2 డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది..

Published : Jul 18, 2022, 12:36 PM IST

Type 2 Diabetes: టైప్ 1 డయాబెటీస్ ను పూర్తిగా తగ్గించుకోవడం అసాధ్యం. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ ను పూర్తిగా తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

PREV
18
 Type 2 Diabetes: ఇలా చేస్తే టైప్ 2 డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది..

ఈ రోజుల్లో డయాబెటీస్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న వయసు వారు సైతం దీనిబారిన పడుతున్నారు. సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ బారిన పడితే.. దానిని పూర్తిగా తగ్గించడం దాదాపు అసాధ్యం. కానీ టైప్ 2 డయాబెటీస్ ను మాత్రం అలా కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి పూర్తిగా బయటపడొచ్చు. 

28

అయితే టైప్ 2 డయాబెటీస్ నుంచి పూర్తిగా బయటపడాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన శైలితో పాటుగా.. చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల  టిప్స్ ను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

సాధారణంగా డయాబెటీస్ ఉన్నవారు కార్భోహైడ్రేట్స్ ను మొత్తమే తీసుకోకూడదని చెబుతుంటారు. అయితే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు  తక్కువ మొత్తంలో కార్భోహైడ్రేట్స్ ను తీసుకోవచ్చు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అందే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉటుంది. 

48

అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లనే తినాలి. ఆకు కూరలు, కూరగాయలు, నట్స్, విత్తనాలు, సుగంధ ద్రవ్యాలు వంటి  ఆరోగ్యకరమైన ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ముఖ్యంగా నీళ్లను పుష్కలంగా తాగాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

58
walking

భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోవడం మానేయండి. భోజనం చేసిన కొద్ది సేపటి తర్వాత కనీసం 10 నిమిషాలైనా చిన్నపాటి నడక నడవండి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. 

68

వ్యాయామం ఎన్నో రోగాల ప్రమాదాలను తగ్గిస్తుంది. అందులోనూ డయాబెటీస్ పేషెంట్లకు వ్యాయామం చాలా మంచిది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం డాక్టర్ సలహా తీసుకోండి. 

78

క్రమం తప్పకుండా నిద్ర సమయాలను పాటించండి. ఎన్నింటికి పడుకోవాలి.. ఎన్నింటికి లేవాలి అన్న విషయాల కోసం టైం టేబుల్ ను తయారుచేసి పెట్టుకోండి. నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. కంటినిండా నిద్రపోతేనే దీనినుంచి మీరు తొందరగా బయటయపడతారు. 

88

శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకే భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచుకోండి. పై టిప్స్ ను క్రమం తప్పకుండా పాటిస్తే టైప్ 2 డయాబెటీస్ తొందరగా తగ్గిపోతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories