ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు ఇవి.. ధరెంతో తెలుసా?

First Published | Jul 18, 2022, 12:09 PM IST

ప్రతిరోజూ కోడి గుడ్డు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాకుండా... ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయి. 

eggs yolk

ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్ ఏంటి..? ఈ ముక్క చిన్న పిల్లాడిని అడిగినా.. గుడ్డు అని చెప్పేస్తారు. అతి తక్కువ ధరలో మనకు ప్రోటీన్స్ అందించడంలో గుడ్డు సహాయం చేస్తుంది. ప్రతిరోజూ కోడి గుడ్డు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాకుండా... ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయి. ఇవి కోడి గుడ్లు కాదు.. మరి ఆ గుడ్డు కథేంటో మనమూ తెలుసుకుందామా..

గల్ గుడ్లు
ఈ గుడ్లు మన దగ్గర పెద్దగా లభించవు. ఇవి బ్రిటీష్ దేశంలో లభిస్తాయి. వీటి ధర చాలా ఎక్కువ. అయితే.. వీటి డిమాండ్ కూడా చాలా ఎక్కువే కావడం గమనార్హం. ఇవి చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. సంవత్సరం మొత్తంలో కేవలం నాలుగు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. రుచి కూడా చాలా బాగుంటాయట. వీటిని ఎక్కువగా ఉడకపెట్టుకొని తింటారట. ఒక్కో గుడ్డు ధర రూ.800 కావడం గమనార్హం.

Latest Videos


పిట్ట గుడ్లు..

ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. మనం ఆడుకునే గోళీలు ఉంటాయి చూశారూ.. ఆ పరిమాణంలో ఉంటాయి. గుడ్డు చిన్నగా ఉన్నా.. వీటి ధర మాత్రం అదరహో అనాల్సిందే. ఈ గడ్డు డజన్ ధర రూ.400 పైమాటే. ఇవి కొంచెం మన కోడిగుడ్లలానే ఉంటాయి. ఇవి ఉడకపెట్టడానికి చాలా తక్కువ సమయం పడతాయి.

ఈము గుడ్లు

అవును! ఈము గుడ్లు తినదగినవి. ఈ గుడ్లు చాలా పెద్దవి. దాదాపు 15 కోడి గుడ్లకు సమానం. ఈము ఆమ్లెట్‌లు రుచికరమైనవి . ఒక్క ఈము గుడ్డు తో చేసిన ఆమ్లెట్ ఒక్కటి తింటే.. మన ఫుల్ బోజనమే పూర్తైపోతుంది. అంత పెద్దదిగా ఉంటుంది. రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. రుచికి, సైజుకి తగినట్లే దీని ధర కూడా ఉంటుంది. ఒక్క ఈము గుడ్డు ధర  రూ.2వేలు దాకా పలుకుతుంది.
 

 టర్కీ గుడ్లు

టర్కీలు గుడ్లు పెట్టడానికి వయస్సు పడుతుంది కాబట్టి ఈ గుడ్లు చాలా అరుదుగా వాణిజ్యపరంగా విక్రయించబడతాయి. అవి చేసినప్పుడు- వారానికి రెండు గుడ్లు మాత్రమే ఆశించవచ్చు. టర్కీ గుడ్లు ఒక రుచికరమైనవి. ఇవి కోడి గుడ్డును పోలి ఉన్నప్పటికీ,  ఖచ్చితంగా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఈ గుడ్డు డజన్ ధర రూ.3వేలకు పైగా ఉంటాయి.

బాతు గుడ్లు

బాతు గుడ్లు అరుదుగా లభించేవి కావు. కానీ... రుచి మాత్రం అద్భుతంగా ఉంటాయి.   సాధారణ గుడ్ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. వీటిలో డజను గుడ్లు మీకు దాదాపు వెయ్యి రూపాయలు ఉంటాయి.  కానీ అవి ఖచ్చితంగా విలువైనవి. బాతు గుడ్లు కోడి గుడ్ల కంటే చాలా పెద్దవి. ఎక్కువగా రైతు బజార్లలో కనిపిస్తాయి. ఈ గుడ్లు రుచికరమైనవి మాత్రమే కాకుండా, సాధారణ గుడ్ల కంటే ఎక్కువ పోషకా,లుప్రోటీన్‌లను కలిగి ఉంటాయి.

click me!