Cooking Hack: వంకాయ కూరంటే మీకు ఇష్టమా? ఈ కూర మరింత రుచిగా రావాలంటే ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు. వంటలో పాలు కలిపితే చాలు, హోటల్ స్టైల్ రుచి వచ్చేస్తుంది. ఎలా వంకాయ కూర పాలతో వండాలో తెలుసుకోండి.
వంకాయ కూరంటే ఎంతో మందికి ఇష్టం. దీన్ని రకరకాలుగా వండుతారు. రెస్టారెంట్లో అయితే ఆ కూర రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే కొందరికి మాత్రం ఆ కూర లోని వగరు రుచి వల్ల అస్సలు నచ్చదు. చాలాసార్లు వంకాయ కూర లేదా గుత్తి వంకాయ వండినప్పుడు దాని తొక్క వల్ల కూర కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. అంతేకాదు, కోసిన వంకాయ ముక్కలు వెంటనే నల్లగా (Discoloration) మారిపోవడం కూడా సహజమే. అయితే కూర టేస్టీగా రావడానికి రెస్టారెంట్లలో వాడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వంకాయ వండేటప్పుడు కేవలం కొన్ని 'పాలు' కలిపితే చాలు, కూర రుచి, దాని టెక్స్‌చర్ మొత్తం మారిపోతుంది. ఈ అద్భుతమైన కిచెన్ ట్రిక్ తెగ వైరల్ అవుతోంది.
23
పాలు కలిపితే ఏమవుతుంది?
వంకాయ ఉడికేటప్పుడు రెండు స్పూన్లు పాలు కలపడం వల్ల మంచి మార్పులు వస్తాయి. అవేంటంటే.. వంకాయ తొక్కలో సహజంగా ఉండే కొద్దిపాటి చేదు లేదా వగరు రుచిని పాలు పూర్తిగా తగ్గిస్తాయి. పాలు కలపడం వల్ల వంకాయ గ్రేవీ లేదా కూరకు హోటల్ స్టైల్‌లో క్రీమీ రుచి, మంచి టెక్స్‌చర్ వస్తుంది. పాలు వంకాయ ముక్కలు నల్లబడకుండా చేసి, వాటి సహజమైన మట్టి సువాసనను నిలిపి ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల కూర చాలా రుచిగా వస్తుంది.
33
చింతపండు మాత్రం వాడొద్దు
వంకాయ కూరలో మీరు పాలు పోసి వండాలనుకుంటే ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి తెలుసుకోండి. = మీరు వండే వంకాయ పులుసు లేదా గ్రేవీలో చింతపండు లేదా పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు వాడకూడదు. అలా వాటిని వాడితే పాలు కలపకూడదు. చింతపండు పులుపుకు పాలు కలిస్తే, అవి విరిగిపోవడమే కాకుండా, గ్రేవీ మరింత చేదుగా లేదా పాడైపోయే ప్రమాదం ఉంది.
చింతపండు వాడని మసాలా గ్రేవీ, గుత్తి వంకాయ లేదా సింపుల్ వంకాయ వేపుడు చేసేటప్పుడు ఈ పాలు ట్రిక్‌ను హ్యాపీగా వాడొచ్చు.