ప్రతి ఇంట్లో హాల్‌కి సోఫానే అందం. దాన్ని రోజూ వాడటం వల్ల సోఫాపై దుమ్ము, చెమట, తిన్న ఫుడ్, పిల్లల గీతలతో త్వరగా మురికిగా మారిపోతుంది. అలాగే వదిలేస్తే సోఫా లుక్ పాడవ్వడమే కాదు, చెడు వాసన వచ్చి అలర్జీలకు కూడా కారణం అవుతుంది. కొన్ని సింపుల్ టిప్స్‌తో మీ సోఫాను మళ్లీ కొత్తదానిలా మార్చుకోవచ్చు.
సోఫాను శుభ్రం చేసే ముందు దాని ఫ్యాబ్రిక్‌ను బట్టి క్లీనింగ్ చేయాలి. దీనికోసం సోఫా కుషన్ల కింద ఉండే 'క్లీనింగ్ కోడ్' లేబుల్ చూడండి. 'W' అని ఉంటే నీటి ఆధారిత క్లీనర్లు, 'S' అని ఉంటే నీళ్లు లేని సాల్వెంట్ (Solvent) క్లీనర్లు వాడాలి. 'X' అని ఉంటే, కేవలం వాక్యూమ్ క్లీనర్ లేదా బ్రష్‌తోనే శుభ్రం చేయాలి. మీరు ఏ క్లీనింగ్ సొల్యూషన్ వాడినా, ముందుగా సోఫాలో కనిపించని చిన్న ప్రదేశంలో టెస్ట్ చేయాలి. ఓ 10 నిమిషాల తర్వాత, ఫ్యాబ్రిక్ రంగు మారలేదని నిర్ధారించుకున్నాకే మొత్తం సోఫాను క్లీన్ చేయడం మంచిది. అలాగే క్లీనింగ్ ముందు వాక్యూమ్ క్లీనర్‌తో సోఫా మూలల్లోని దుమ్మును పూర్తిగా తీసేయండి. తడి గుడ్డతో తుడవండి.