Monsoon FootWear: వర్షాకాలంలో చెప్పులు జారుతున్నాయా? ఇలా చేస్తే జారదు

Published : Jul 13, 2026, 07:48 PM IST

Monsoon Footwear: వర్షాకాలంలో బురద ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. అడుగు సరిగా పడకపోయినా, చెప్పులు సరిగా లేకపోయినా జారి కింద పడిపోతూ ఉంటాం. దీని వల్ల కాళ్లు, చేతులు విరగగొట్టుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

PREV
14
వర్షాకాలంలో ఏ చెప్పులు వాడాలి?

వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా నడిచినా కూడా ఒక్కోసారి కాల్లు జారుతూ ఉంటాయి. అలా జారడానికి మనం వేసుకున్న  చెప్పులు కూడా కారణం కావచ్చు. అందుకే వర్షాకాలానికి సరిపోయే చెప్పులు ధరించాలి. ముఖ్యంగా… మంచి గ్రిప్, మందపాటి సోల్ ఉండే రబ్బరు చెప్పులు వాడటం బెస్ట్. ఈ చెప్పులు తడి మీద కూడా జారకుండా ఉంటాయి

24
చెప్పులు గ్రిప్ పెంచుకోవడానికి...

ఒక్కోసారి మనం రబ్బరు చెప్పులు వాడినా కూడా అవి జారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఆ చెప్పులు పాతగా మారినా, లేదా వాటి అడుగు భాగం నునుపుగా మారినా కూడా చెప్పులు జారుతూ ఉంటాయి.  అలాంటప్పుడు.. మీ చెప్పులు అడుగు  భాగాన్ని సాండ్ పేపర్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల చెప్పుల సోల్ కాస్త గరుకుగా మారుతుంది. ఫలితంగా చెప్పులు జారవు.

34
శుభ్రత చాలా ముఖ్యం

వానాకాలంలో చెప్పులు వేసుకునే ముందు, వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అడుగుభాగాన్ని క్లీన్‌గా చూసుకోవాలి. మట్టి, చెత్తాచెదారం లేదా నూనె వంటివి అంటుకుంటే గ్రిప్ తగ్గిపోతుంది. అందుకే చెప్పులను ఎప్పటికప్పుడు బ్రష్‌తో శుభ్రం చేయాలి.

జాగ్రత్తగా నడవాలి..

మనం వర్షాకాలానికి తగినట్లు చెప్పులు ధరించినా కూడా.. వర్షాకాలం నీటిలో వేగంగా నడవకూడదు. అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడవడం చాలా మంచిది.  ముఖ్యంగా టైల్స్, మార్బుల్స్, మెట్ల మీద నెమ్మదిగా నడవడం చాలా మంచిది. వేగంగా నడిస్తే జారిపోయే ప్రమాదం ఉంది.

44
పాత చెప్పులు మార్చేయండి
మీ చెప్పులు మరీ పాతవైపోయినా, సోల్ పూర్తిగా అరిగిపోయినా లేదా పగుళ్లు వచ్చినా వాటిని వాడటం ఆపేయండి. గాయాలకు డబ్బు ఖర్చు పెట్టడం కన్నా కొత్త చెప్పులు కొనడం మేలు. వానాకాలంలో స్టైల్ కన్నా సేఫ్టీనే ముఖ్యం. సరైన చెప్పులు ఎంచుకుని, కాస్త జాగ్రత్తగా నడవండి.
Read more Photos on
click me!

Recommended Stories