ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. కనీసం పాతికేళ్లు కూడా రాకుండానే కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. మోకాళ్లు,కీళ్ల నొప్పులతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యోగాసనాలు.
వృక్షాసనంలో ఒక కాలి మీద నిలబడి యోగాసనం వేయాలి. ఇది కాళ్ల బలం పెంచుతుంది. శరీరాన్ని నడిపించే కీళ్లకు ఈ ఆసనం మద్దతుగా పని చేస్తుంది. స్థిరంగా ఉండటం వల్ల దృఢత్వం తగ్గుతుంది.
25
వీరభద్రాసనం..
వీరభద్రాసనంలో చాతీ, తుంటి, కాళ్ళను సాగదీస్తారు. దీని వల్ల కండరాల బలం పెరుగుతుంది. నొప్పితో బాధపడే భాగాల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. మలినాల నివారణతో పాటు కీళ్ల ఆరోగ్యానికి మంచిది.
35
పిల్లి-ఆవు భంగిమ
పిల్లి-ఆవు భంగిమ ద్వారా వెన్నెముక బలం పెరుగుతుంది. నడుము భాగంలో కండరాలను ఉత్తేజితం చేసి నొప్పిని తగ్గిస్తుంది. కోర్ ముసుల్స్ బలపడటంతో శరీరం బలంగా మారుతుంది.
వంతెన భంగిమ వల్ల తుంటి, వెన్నెముక, తొడల కండరాలు బలపడతాయి. నడుము నొప్పిని తగ్గించడంలో ఇది మంచి మార్గం. ఛాతీ విస్తరణ వల్ల శ్వాస పద్ధతులు మెరుగవుతాయి.
55
త్రికోణాసన భంగిమ
త్రికోణాసన భంగిమలో శరీరాన్ని పక్కకి వంచటం వల్ల కండరాలు బలపడతాయి. కీళ్ల చలనశీలత పెరగడం వల్ల వాపు తగ్గుతుంది. నొప్పికి కారణమయ్యే గట్టితనం నెమ్మదిగా మాయమవుతుంది.