Yoga Day 2022: యోగా గుండె జబ్బుల నుంచి హై బీపీ వంటి ఎన్నో రోగాలను తగ్గిస్తుంది..!

Published : Jun 16, 2022, 10:52 AM IST

Yoga Day 2022: యోగాసనాలను సర్వ రోగ నివారిణీగా చెప్తారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే క్రమం తప్పకుండా యోగాను చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతో పాటుగా ఎన్నో రోగాలు దూరమవుతాయి.   

PREV
18
Yoga Day 2022: యోగా గుండె జబ్బుల నుంచి హై బీపీ వంటి ఎన్నో రోగాలను తగ్గిస్తుంది..!

Yoga Day 2022: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు తమ ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. సరిగ్గా తినడానికి కూడా వీలు లేకుండా బతికేస్తున్నారు. అందుకే నేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం (Health) బాగుండాలంటే ముందుగా మనం చేయాల్సిన మొదటి పని పౌష్టికాహారాన్ని తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామాలను, యోగా (Yoga)ను చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

28

అందులో రెగ్యులర్ గా యోగా (Yoga)ను చేయడం వల్ల పనిలో ఒత్తిడి (Stress) తగ్గడం తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

38

ఎముకలను బలంగా చేస్తుంది:  వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు (Bones) బలహీనంగా మారుతుంటాయి. దీనికి కారణం ఎముకల్లో ఉండే కాల్షియం (Calcium)తగ్గుతూ ఉండటమే. దీనివల్ల  బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరు రెగ్యులర్ గా యోగాను చేయడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది.  అంతేకాదు కొద్ది రోజుల్లోనే ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు కూడా రావని నిపుణులు చెబున్నారు. ప్రక్క కోన ఆసనం, యోధుడి  ఆసనం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. 
 

48

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:  కొన్ని రకాల యోగాసనాల వల్ల మన రోగ నిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. ఎందుకంటే అవి శరీరంలో శోషరసం ద్రవాలను (Lymphatic fluid)పెంచుతాయి. ఇక వీటిలో ఎక్కువ మొత్తంలో Immune cells ఉంటాయి. ఇక ఇమ్యూనిటీ పవర్ పెరిగితే.. మనం ఎలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదు. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా సోకవు. ఇందుకోసం త్రికోణసానం, తడసన ఆసనాలు వేయాలి.

58

నిద్రలేమి సమస్య ఉండదదు: మారుతున్న జీవన శైలి, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల నేడు ఎంతో మంచి చిన్నవయసు వారు సైతం నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి యోగాసాలు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. రోజూ యోగా చేయడానికి వీలు లేని వాళ్లు వారానికి మూడు సార్లు చేసినా మంచిగా నిద్రపడుతుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఇందుకోసం శవాసనం చేయాలి.
 

68

రక్తపోటును తగ్గిస్తుంది:  రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల అధిక రక్తపోటు (High blood pressure)కూడా దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. యోగాను చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తం బాగా అందుతుంది. ఇందుకోసం వీరభద్రాసనం, ప్రాణాయానం ట్రై చేయండి. 

78

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:  క్రమం తప్పకుండా యోగాను చేయడం వల్ల గుండె ఆరోగ్యం (Heart health)గా, ఫిట్ గా ఉంటుంది. ఇది గుండె కండరాలను బలంగా మారుస్తుంది. అంతేకాదు యోగాతో గుండె కొట్టుకోవడం మెరుగ్గా ఉంటుంది. అలాగే గుండెపోటు (Heart attack) ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తనాళాల్లో కొవ్వు ఉంటే దాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పాదాంగుష్టనస లేదా జానా శిరసానస వంటివి ట్రై చేయండి. 

88

మతిమరుపు సమస్యను పోగొడుతుంది: యోగాసనాలు మెదుడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది మెమోరీ పవర్ ను కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మతిమరుపు (Forgetfulness)సమస్యతో బాధపడేవారు రెగ్యులర్ గా యోగాసనాలను చేయాలని చెబుతున్నారు. ఇందుకోసం  బలాసన లేదా విపరీత కరణి వంటివి చేయాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories