Published : Jun 16, 2022, 09:45 AM ISTUpdated : Jun 16, 2022, 09:46 AM IST
Health Tips: తులసి ఆకులను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎన్నో ఇన్ఫెక్షన్లను తొలగించడానికి సహాయపడుతుంది. తులసి ఆకులే కాదు తులసి గింజలు (Basil seeds) కూడా మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.
తులసి ఆకులు (Basil leaf) మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ ఆకులు శరీరంలోని మంట నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటాయి. అలాగే రోగనిరోధక శక్తి (Immunity)ని బలోపేతం చేస్తుంది. తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటాయి. అయితే తులసి విత్తనాలు (Basil seeds)కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్న ముచ్చట చాలా మందికి తెలిసి ఉండదు. తులసి గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలుసుకుందాం పదండి.
28
తులసి గింజల్లో ప్రోటీన్ (Protein), ఫైబర్ (Fiber), ఐరన్ (Iron)పుష్కలంగా ఉంటాయి. ఈ తులసి గింజలు జీర్ణక్రియ, బరువు తగ్గడం, దగ్గు, జలుబు వంటి జబ్బులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
38
ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు: తులసి గింజలు మెదడుకు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి (Stress),ఆందోళన (Anxiety) వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి గింజలు మానసిక అనారోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. ఒత్తిడి కలిగినప్పుడు తులసి విత్తనాల్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది మనసును శాంతపరుస్తుంది.
48
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తులసి గింజల్లో ఫ్లేవనాయిడ్లు (Flavonoids), ఫినోలిక్ (Phenolic)ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతాయి. అంతేకాక శీతాకాలంలో (winter) తులసి విత్తన కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసి విత్తనాల్ని టీలో వేసుకుని కూడా తాగొచ్చు.
58
తులసి విత్తనాల్లో చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ (Free radicals) వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల వృద్ధాప్యం ఛాయలు చిన్నవయసులో రావడం ప్రారంభమవుతాయి. అయితే తులసి గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు.
68
తులసి గింజలు జీర్ణవ్యవస్థ (Digestive system)ను మెరుగుపరిచి కడుపు సమస్యలను దూరం చేస్తాయి. తరచుగా చాలా మందికి మలబద్ధకం (Constipation), అసిడిటీ (Acidity), అజీర్ణం (Indigestion) వంటి కడుపు సమస్యలు వస్తుంటాయి. ఈ వ్యాధులన్నింటికీ తులసి విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
78
తులసి గింజల్లో ఉండే ఫైబర్ (Fiber)పేగులను పూర్తిగా శుద్ధి చేస్తుంది. ఇందుకోసం తులసి విత్తనాల్ని రెండు మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి. దాంతో విత్తనాలు ఉబ్బుతాయి. అలాగే వాటిపైన జెలటిన్ పొరను ఏర్పరుస్తాయి. నీళ్లతో సహా తులసి విత్తనాల్ని తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
88
అధిక బరువు (Over weight), ఊబకాయం (Obesity)సమస్యతో బాధపడేవారికి తులసి గింజలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే తులసి గింజలు బరువు తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. తులసి విత్తనాలలో కేలరీలు (Calories)చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ (Fiber)అధికంగా ఉంటుంది. ఇవి మీకు అంత తొందరగా ఆకలి కానివ్వవు. వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాక తులసి విత్తనాన్ని గ్రీన్ టీ తయారీకి కూడా ఉపయోగించవచ్చు. ఇది బరువును తగ్గిస్తుంది.